ETV Bharat / city

'ప్రతి షోకు 100 టికెట్లు ఇవ్వాలి'.. మేయర్​ లేఖ కలకలం..! - 'ప్రతి షోకు 100 టికెట్లు ఇవ్వాలి'.. మేయర్​ లేఖ కలకలం..!

'ప్రతి షోకు 100 టికెట్లు ఇవ్వాలి'.. మేయర్​ లేఖ కలకలం..!

author img

By

Published : Mar 11, 2022, 6:27 AM IST

06:17 March 11

'ప్రతి షోకు 100 టికెట్లు ఇవ్వాలి'.. మేయర్​ లేఖ కలకలం..!

థియేటర్ల వద్ద టిక్కెట్లు లేవు.. ఆన్‌లైన్‌లో అందుబాటులో లేవు.. బుక్‌మై షో సైట్‌లో దొరకడం లేదు.. బయట మాత్రం ఒక్క టిక్కెట్‌ రూ.500 నుంచి రూ.750 వరకు విక్రయిస్తున్నారు. ఇదీ ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడలో సినిమా టిక్కెట్ల దందా..! నిన్నటి వరకు కదిలితే కొరడా ఝుళిపించేందుకు సిద్ధంగా ఉన్న రెవెన్యూ, పోలీసు అధికారులు.. నేడు అభిమానులు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు.

తెలుగు సినీ హీరో ప్రభాస్‌ నటించిన సినిమా ‘రాధేశ్యామ్‌’ శుక్రవారం విడుదల సందర్భంగా బ్లాక్‌లో టిక్కెట్ల దందాకు తెరలేచింది. విజయవాడ నగరంలో ఒక్క టిక్కెట్‌ కూడా అందుబాటులో లేదు. ప్రభుత్వం ధరలు పెంచుకునేందుకు సైతం అనుమతించిన విషయం తెలిసిందే. మల్టీప్లెక్సులలో రూ.250 వరకు విక్రయించాల్సి ఉంది. గ్రామీణంలో రూ.100 వరకు విక్రయించుకోవచ్ఛు కానీ ప్రస్తుతం రూ.500కు తక్కువకు టిక్కెట్‌ లేదని అభిమానులే వాపోతున్నారు. గాంధీనగర్‌లోని సినిమా పంపిణీ సంస్థ కార్యాలయం వద్ద అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని చెదరగొట్టారు.

ప్రతి షోకు 100 టికెట్లు ఇవ్వాలి..

కొత్త సినిమా విడుదలైనప్పుడు ప్రతి షోకు తనకు 100 టిక్కెట్లు ఇవ్వాలని మేయర్ భాగ్యలక్ష్మి లేఖ రాయడం కలకలం సృష్టిస్తోంది. ప్రజాసమస్యలపై పట్టని శ్రద్ధ.. ఇలా కొత్త సినిమా టిక్కెట్లుపై చూపించడమేమిటని తెదేపా, సీపీఎం నేతలు విమర్శించారు.

ఇదీ చూడండి: ప్రపంచ సినీ చరిత్రలో తొలిసారి.. 'రాధేశ్యామ్​' కోసమే అలా!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.