neeraj honor killing case : హైదరాబాద్ బేగంబజార్‌లో హత్యకు గురైన నీరజ్ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో హోంమంత్రి మహమూద్ అలీని నీరజ్ కుటుంబసభ్యులు కలిశారు. హత్యపై విచారణ జరిపి న్యాయం చేయాలని నీరజ్ భార్య, తల్లిదండ్రులు, బంధువులు.... హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు. నీరజ్ కేసు విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారని మార్వాడీ నేతలు తెలిపారు. అన్యాయంగా నీరజ్‌ను పొట్టనపెట్టుకున్నవారిని వదిలిపెట్టొద్దని ఆయన భార్య సంజన వేడుకున్నారు
'నీరజ్ హత్య వెనకున్న అసలైన దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలి. విచారణ పేరుతో కాలయాపన చేయకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయమని హోంమంత్రిని కోరాం. అతడి భార్యాపిల్లలకు భరోసా కల్పించమని.. సంజనకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించమని అడిగాం. మంత్రి మహమూద్ అలీ సానుకూలంగా స్పందించారు.' -- మార్వాడీ సంఘం నేతలు