ETV Bharat / city

చార్జింగ్​ దీపాల కాంతుల్లోనే.. కల్యాణం కానిచ్చేశారు! - visakha lo latest marriage news

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ జిల్లా అనకాపల్లిలో గవరపాలెంలోని చార్జింగ్​ దీపాల వెలుగుల్లోనే ఏడడుగులు వేసిందో జంట. కరోనా వైరస్​ వ్యాప్తి నివారణలో భాగంగా లాక్​డౌన్​ అమలులో ఉంది. దీనికి తోడు భారీ వర్షం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల చార్జింగ్​ లైట్ల వెలుతురులోనే పెళ్లి కానిచ్చేశారు.

NO LIGHTING IN AP MARRIAGE
చార్జింగ్​ దీపాల కాంతుల్లోనే.. కల్యాణం కానిచ్చేశారు!
author img

By

Published : Apr 26, 2020, 4:22 PM IST

పెళ్లంటే పందిళ్లు, ముగ్గులు, ముచ్చట్లు అనేది ఒకప్పటి మాట. కరోనాతో కల్యాణ కాంతి ఎక్కడ కానరాకుండా పోయింది. అతికొద్ది మంది మధ్య తూతూ మంత్రంగా కానిచ్చేస్తున్నారు. ఇక ఏపీలోని విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగిన ఈ పెళ్లిలో కనీసం విద్యుత్ కాంతులు కూడా లేవు.

కరోనా వైరస్​ వ్యాప్తికి తోడు భారీ వర్షం కారణంగా విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది. దీంతో చార్జింగ్​ దీపాల కాంతుల్లోనే ఏడడుగులు వేసిందా జంట. గవరపాలెంలోని నిదానం దొడ్డిలో వధువరులతో కలిసి తల్లిదండ్రులు మాస్కులు ధరించి చార్జింగ్ లైట్ల వెలుగుల్లోనే వివాహం కానిచ్చేశారు.

ఇవీ చూడండిి: 'వేసవిలో భారత్​ కరోనాను జయించొచ్చు!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.