మార్పు అనేది ఓ నిరంతర ప్రక్రియ అని... అయితే ఆ మార్పు సమాజానికి మంచి జరిగేలా ఉండాలని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అభిప్రాయపడ్డారు. 'మంచి మార్పు కోసం' అనే పేరుతో ఆయన రాసిన పుస్తకం, పాటల సీడీలను ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రజల పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తంగెళ్లపల్లి శ్యామ్‌సుందర్, అధికార ప్రతినిధి కొడవలి రాజగోపాల్, సహా మాజీఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
మార్పుని ఎవరూ ఆపలేరని జస్టిస్ చంద్రకూమార్ తెలిపారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను, నిస్వార్థ రాజకీయాలను, ఉత్తమ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలను ఈ పుస్తకంలో పొందుపర్చినట్టు పేర్కొన్నారు. సమాజహితం కోసం నిరంతరంగా, నిస్వార్థంగా కృషి చేసే వారి అవసరం ప్రస్తుతం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.