ETV Bharat / city

ఎమ్మెస్సార్​ మృతిపట్ల ప్రముఖుల సంతాపం - condolence on senior congress leader msr death

కాంగ్రెస్​ సీనియర్​ నేత ఎమ్మెస్సార్​ మరణం పట్ల ముఖ్యమంత్రి సహా మంత్రులు, కాంగ్రెస్​ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన శైలి ప్రత్యేకమని కేసీఆర్​ అన్నారు. ఎమ్మెస్సార్​ మరణం పార్టీకి తీరని లోటని కాంగ్రెస్​ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

many condolence on msr deathmany condolence on msr death
ఎమ్మెస్సార్​ మృతిపట్ల ప్రముఖుల సంతాపం
author img

By

Published : Apr 27, 2021, 8:43 AM IST

Updated : Apr 27, 2021, 1:03 PM IST

కాంగ్రెస్​ సీనియర్​ నేత, మాజీ మంత్రి ఎమ్మెస్సార్‌ మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్​ సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ వాదిగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి, ఎంపీ, ఆర్టీసీ ఛైర్మన్​గా.. ఆయన ప్రత్యేక శైలి కనబరిచారన్నారు. రాజకీయాల్లో ముక్కుసూటి మనిషిగా పేరొందారని సీఎం గుర్తు చేసుకున్నారు. దివంగత ఎమ్మెస్సార్ కుటుంబ సభ్యులకు కేసీఆర్ ​.. ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఎమ్మెస్సార్ మరణం పట్ల మంత్రులు కేటీఆర్​, హరీశ్​రావు, ఈటల రాజేందర్​, శ్రీనివాస్​గౌడ్​, శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్​రాష్ట్రవ్యవహారాల బాధ్యుడు మాణిక్కం ఠాగూర్​, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి, పొన్నం ప్రభాకర్​, పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, ప్రగాఢ సంతాపం తెలిపారు. ఎమ్మెస్సార్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. పార్టీలో క్రమశిక్షణ కలిగిన గొప్ప నాయకుడని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. ఆయన మరణం కాంగ్రెస్​కు తీరని లోటన్నారు. ఇవాళ మధ్యాహ్నం జూబ్లీహిల్స్​లోని మహా ప్రస్థానం శ్మశాన వాటికలో ఎమ్మెస్సార్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఎమ్మెస్సార్ మృతిపట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

ఇవీచూడండి: మాజీ మంత్రి ఎమ్మెస్సార్‌ కన్నుమూత

Last Updated : Apr 27, 2021, 1:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.