ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది మినీ హార్బర్‌లో ఆదివారం వింత రొయ్య అబ్బురపరిచింది. అక్కడ 510 గ్రాముల బరువున్న మాంటీస్ ష్రింపు(మాంటీస్ రొయ్య) దర్శనమిచ్చింది. స్థానిక మత్స్యకారుల వలకు ఈ రొయ్య చిక్కింది.
ఒకప్పుడు విరివిగా లభించినా, ప్రస్తుతం అరుదుగా దొరుకుతుందని, ఇది తేలు మాదిరిగా ఉంటుందని స్థానికులు తెలిపారు. ఈ రొయ్యకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి ధర ఉంటుందని.. దీని కళ్ల నుంచి కాంతులు వెదజల్లుతుందని మత్స్యశాఖ ఏడీ కృష్ణారావు చెప్పారు.
ఇదీ చూడండి: 'పీవీ.. తెలంగాణ నేల సృష్టించిన అద్భుత మేధస్సు'