ETV Bharat / city

MANSAS TRUST: సంచైత నియామకం రద్దుపై అప్పీళ్లు - మాన్సస్ ట్రస్టు వార్తలు

మాన్సస్ ట్రస్టుకు ఛైర్మన్​గా సంచైత గజపతిరాజు నియామకాన్ని రద్దు చేస్తూ.... ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ధర్మాసనం ఎదుట అప్పీళ్లు దాఖలయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 3 అప్పీళ్లు వేయగా.. సంచైత మరో 3 అప్పీళ్లు వేశారు. ఏపీ ప్రభుత్వం వేసిన 2 అప్పీళ్లు మాత్రమే కేసుల జాబితాలో విచారణకు రాగా... మిగిలిన అప్పీళ్లతో కలిపి విచారించాలని వారి తరపు న్యాయవాదులు కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం కేసును 2 వారాలకు వాయిదా వేసింది.

mansas-trust-petitions-in-highcourt
సంచైత నియామకం రద్దుపై అప్పీళ్లు
author img

By

Published : Jul 14, 2021, 7:30 AM IST

మాన్సాస్ ట్రస్ట్ వ్యవస్థాపక కుటుంబ సభ్యురాలిగా, ట్రస్ట్ ఛైర్మన్​గా, సింహాచలం దేవస్థానం ఛైర్మన్​గా సంచైత గజపతిరాజు నియామకాన్ని రద్దు చేస్తూ.... ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ధర్మాసనం ఎదుట అప్పీళ్లు దాఖలయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, సంచైత చెరో 3 అప్పీళ్లు వేశారు. ఏపీ ప్రభుత్వం వేసిన 2 అప్పీళ్లు మాత్రమే కేసుల జాబితాలో విచారణకు రాగా... మిగిలిన వాటిని కలిపి విచారించాలని వారి తరఫు న్యాయవాదులు కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం కేసును 2 వారాలకు వాయిదా వేసింది.

స్త్రీ, పురుషుల మధ్య వివక్ష

సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి , దేవదాయ కమిషనర్ అప్పీల్ వేశారు. 1958 నవంబర్ 12న రాసుకున్న ట్రస్ట్ దస్తావేజు ప్రకారం ' కుటుంబంలో పెద్దవాళ్లయిన పురుషులు' వంశపారంపర్య ఛైర్మన్ అధ్యక్షులుగా వ్యవహరించాలని ఉందని, అందుకు విరుద్ధంగా సంచైత గజపతిరాజు తదితరులను ట్రస్టు వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా ప్రభుత్వం నియమించిందని అశోక్ గజపతి రాజు ఆ రాష్ట్ర హైకోర్టులో వ్యాజ్యం వేశారని పిటిషన్​లో పేర్కొన్నారు. ఏపీ దేవాదాయ చట్టం సెక్షన్ 17 ట్రస్ట్ వ్యవస్థాపక కుటుంబ సభ్యులను గుర్తించే వ్యవహారాన్ని వివరిస్తోందన్నారు. దాని ప్రకారం ' వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ' పరిధిలోకి పిల్లలు, మనవళ్లు వస్తారు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు.. ట్రస్ట్ డీడ్​కు అనుగుణంగా ఉందన్నారు. దేవాదాయ చట్టంలోని సెక్షన్17 , 160 స్ఫూర్తికి విరుద్ధంగా తీర్పు ఉందని... అధికరణ 15ను ఉల్లంఘించేదిగా ఉందని పిటిషన్​లో తెలిపారు. ప్రాథమిక హక్కులకు లోబడి సంప్రదాయాలు ఉండాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. లింగం ఆధారంగా ఏ వ్యక్తిని వివక్షకు గురిచేయడానికి వీల్లేదని సుప్రీం చెప్పిందన్నారు. ప్రస్తుత కేసులో ట్రస్ట్ డీడ్, లింగం ఆధారం చేసుకొని వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా గుర్తింపు పొందేందుకు సంచైత తదితరులు అనర్హులని అశోక్ గజపతిరాజు ' చెబుతున్నారని తెలిపారు. స్త్రీ, పురుషుల మధ్య వివక్షను సెక్షన్ 17 చూపడం లేదు. ఈ నేపథ్యంలో హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయాలని కోరారు.

ట్రస్ట్ డీడ్​లను శాసనసభ రద్దు చేసింది..

చట్టం 30/1987 ద్వారా ట్రస్ట్ డీడ్ లను శాసనసభ రద్దు చేసిందని పిటిషన్ లో తెలిపారు. ఈ నేపథ్యంలో అశోక్ గజపతిరాజు ఆధారపడిన డీడ్ చెల్లదన్నారు. సెక్షన్ 17 ప్రకారం వ్యవస్థాపక కుటుంబ సభ్యుల విషయంలో పురుషులు, స్త్రీల మధ్య వివక్ష చూపడం లేదనే విషయాన్ని సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకొని ఉండాల్సిందన్నారు. దేవాదాయ చట్టం 1987 సెక్షన్ 16 వంశపారంపర్య ట్రస్టీల వ్యవస్థను రద్దుపరిచిందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఉండాల్సిందన్నారు. వ్యవస్థాపక కుటుంబ సభ్యుల గుర్తింపు వివాదాలను తేల్చేది ఏపీ దేవాదాయ ట్రైబ్యునల్ అనే విషయాన్ని సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోవాల్సిందన్నారు. సెక్షన్ 87 ( హెచ్ ) ప్రకారం అశోక్ గజపతిరాజు ప్రత్యామ్నాయంగా ట్రైబ్యునల్ ను ఆశ్రయించాలన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయాలని కోరారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ ఎస్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది .

ఇదీ చదవండి: cabinet on jobs: ఖాళీల గుర్తింపు, భర్తీపై నేడు మరోసారి మంత్రివర్గం భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.