కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్ ఈ నెల 18న సోమవారం హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు మద్దతుగా ఆయన సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు జమ్మికుంట పట్టణంలోని గాంధీచౌక్ వద్ద ప్రచారం నిర్వహిస్తారు. అదే విధంగా నియోజకవర్గం ఎన్నికల ఇన్‌ఛార్జీలు, మండల చీఫ్ కో ఆర్డినేటర్లు, గ్రామ ఇన్‌ఛార్జిలతో సమావేశమవుతారు. తాజా రాజకీయ పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తారు. మహిళల సమావేశంలోనూ ఠాగూర్ పాల్గొంటారు. ఆయనతో పాటు ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసన్ కృష్ణన్, కాంగ్రెస్ ముఖ్య నాయకులు ప్రచారంలో పాల్గొననున్నారు.
హరీశ్ పదవికి రాజీనామా చేసి ప్రచారంలో పాల్గొనాలి
మంత్రి హరీశ్‌రావు తన పదవికి రాజీనామా చేసి హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయెల్‌కు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి ఆదివారం లేఖ రాశారు. ఆర్థికమంత్రిగా ఉన్న హరీశ్ నెల రోజులుగా ప్రచారంలో పాల్గొనడం ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తుందన్నారు.
ఉపఎన్నిక వివరాలిలా...
అక్టోబర్ 30న హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad By Election Polling 2021) పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఈటల రాజీనామాతో ఎన్నిక అనివార్యం
రాష్ట్ర మాజీ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ నియోజకవర్గం(Huzurabad By Election 2021)లో ఉపఎన్నిక వచ్చింది. ఆయన భాజపా తీర్థం పుచ్చుకున్నప్పటి నుంచి నియోజకవర్గంలో రాజకీయం రంజుగా మారింది. ఇటు అధికార తెరాస, అటు భాజపా ప్రచారాల(Huzurabad By Election Campaign 2021)తో హోరెత్తుతోంది. ఇప్పటికే తెరాస మంత్రి హరీశ్ రావు నియోజకవర్గంలోనే ఉండి.. అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉంటున్నారు. రోజుకో వర్గానికి సంబంధించి ఆత్మీయ, సమ్మేళన సభలు ఏర్పాటు చేస్తూ ప్రజల్లో తెరాసపై పాజిటివ్ టాక్ తీసుకొస్తున్నారు.
ఇదీ చూడండి: Huzurabad By Election: కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు ఎక్కడ? రేవంత్‌రెడ్డి ఏం చేయబోతున్నారు?