తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల శాఖ ఛైర్మన్‌గా రెండోసారి బాధ్యతలు చేపట్టిన మందుల సమేల్ను సంస్థ ఎండీ భాస్కరాచారి ఘనంగా సన్మానించారు. హైదరాబాద్ నాంపల్లిలోని శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన సామేల్‌కు కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
తనపై నమ్మకంతో రెండోసారి బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సామేల్ కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ బలోపేతానికి కృషి చేసి సీఎం నమ్మకాన్ని నిలబెడతానని పేర్కొన్నారు. ఈఏడు వర్షాలు ఎక్కువగా కురుస్తున్నందున రాష్ట్రవ్యాప్తంగా పంటలు సమృద్ధిగా పండుతాయని, తెలంగాణ ధాన్యం దేశనలుమూలలకు ఎగుమతి చేస్తామని వెల్లడించారు.
రాష్ట్రంలో నూతన గోదాములు నిర్మించి అన్నదాతలకు అండగా నిలుస్తామని ఛైర్మన్ సామేల్ హామీ ఇచ్చారు. తెలంగాణను ధాన్యాగార రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.
- ఇదీ చూడండి:- రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!