ETV Bharat / city

Apsrtc: ఆర్టీసీ బస్సుల్లో మాస్కు తప్పనిసరి... లేకుంటే జరిమానా!

apsrtc: ఏపీలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కొవిడ్​ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీఎస్​ఆర్టీసీ బస్సుల్లో మాస్కు తప్పనిసరి చేసింది. మాస్క్​ పెట్టుకోకుంటే జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది.

author img

By

Published : Jan 9, 2022, 10:13 PM IST

Apsrtc
Apsrtc

apsrtc: ఏపీఎస్​ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బస్సుల్లో మాస్కు తప్పనిసరి చేసింది. ప్రయాణికులు మాస్కు ధరించకుంటే రూ.50 జరిమానా విధించాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు..

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 1,257 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 38,479 శాంపిల్స్​కు నిర్ధరణ పరీక్షలు చేశారు. చిత్తూరులో 254, విశాఖలో 196, తూర్పుగోదావరిలో 93, కృష్ణా లో 117, గుంటూరులో 104, నెల్లూరులో 103, ప్రకాశంలో 40, శ్రీకాకుళంలో 55, అనంతపురంలో 138, కర్నూలులో 29, కడపలో 20, పశ్చిమగోదావరిలో 25, విజయనగరంలో 83 కేసులు నమోదైనట్లు అధికారులు వివరించారు. రాష్ట్రంలో 4,774 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 24 గంటల వ్యవధిలో గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారని అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మృతుల సంఖ్య 14,505 కు పెరిగింది. 24 గంటల్లో 140 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.

దేశవ్యాప్తంగా కరోనా పంజా..

India Corona cases: దేశంలో రోజువారీ కొవిడ్​ కేసులు భారీగా నమోదవుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 1,59,632 మంది వైరస్ బారిన పడ్డారు. కరోనా వల్ల మరో 327మంది మృతి చెందారు. 40,863 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. కొవిడ్​ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 10.21 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

  • మొత్తం కేసులు: 3,55,28,004‬
  • మొత్తం మరణాలు: ,83,790
  • యాక్టివ్ కేసులు: 5,90,611
  • మొత్తం కోలుకున్నవారు: 3,44,53,603

ఒమిక్రాన్ వ్యాప్తి..

Omicron Cases In India: దేశంలో ఒమిక్రాన్​ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3,0623కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అందులో 1,409 మంది కోలుకున్నట్లు తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్ర 1,009 ఒమిక్రాన్​ కేసులతో తొలి స్థానంలో ఉంది. 513 మంది ఒమిక్రాన్​ బాధితులతో దిల్లీ తర్వాత స్థానంలో ఉంది.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 1,673 కొవిడ్‌ కేసులు... కొవిడ్‌ ఆంక్షలు పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.