ETV Bharat / city

Suicide Attempt : ప్రగతిభవన్‌ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం - man tried to commit suicide at pragathi bhavan

కాసేపట్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమవనుండగా.. ప్రగతి భవన్​ వద్ద ఇద్దరు అన్నదమ్ముల ఆందోళన దుమారం రేపింది. సమావేశానికి వస్తున్న మంత్రుల వాహనానికి అడ్డుగా వెళ్లి హల్​చల్ సృష్టించారు. వారిలో ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.

suicide attempt, suicide attempt at pragathi bhavan
ప్రగతిభవన్‌ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం, వ్యక్తి ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Jun 8, 2021, 3:31 PM IST

Updated : Jun 8, 2021, 4:34 PM IST

ప్రగతిభవన్ వద్ద ఇద్దరు వ్యక్తులు హల్ చల్ చేశారు. మంత్రివర్గ సమావేశానికి మంత్రులు వస్తున్న సమయంలో కొంపల్లి ప్రాంతానికి చెందిన అన్నదమ్ములు... వారి వాహన శ్రేణికి అడ్డుపడేందుకు ప్రయత్నించారు. అందులో ఒక వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమై అడ్డున్నారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు. తమ ఇళ్లు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి డబ్బులు ఇవ్వనందుకు పేట్ బషీరాబాద్ పోలీసులను ఆశ్రయిస్తే అధికారులు తమను వేధిస్తున్నారని వారు ఆరోపించారు.

ఘటనా జరిగిన వెంటనే హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ హుటాహుటిన ప్రగతిభవన్‌కు వచ్చారు. ఘటనపై పోలీసుల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. ప్రగతి భవన్ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లపై చర్చించారు.

ప్రగతిభవన్‌ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Last Updated : Jun 8, 2021, 4:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.