ETV Bharat / city

Man Beaten by cops: 'పోలీసుల దెబ్బలు తట్టుకోలేకే.. భవనం పైనుంచి దూకాను' - allegations on sattenapalli police

Man Beaten by cops:పోలీస్ స్టేషన్ భవనంపై నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. ఏపీలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. విచారణ పేరుతో పోలీసులు చావబాదారని.. దెబ్బలు తట్టుకోలేక భవనంపైనుంచి దూకానని బాధితుడు వాపోయాడు.

men beaten by sattenapalli police
men beaten by sattenapalli police
author img

By

Published : Jan 27, 2022, 7:57 PM IST

Updated : Jan 27, 2022, 9:30 PM IST

Man Beaten by cops:ఏపీలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్ పైనుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. ఓ చోరీ కేసులో అనుమానంతో చల్లా సుబ్బారావు అనే యువకుడిని గ్రామీణ పోలీసులు బుధవారం స్టేషన్​కు తీసుకువచ్చారు.

అయితే విచారణ పేరుతో పోలీసులు చావబాదారని.. దెబ్బలు తట్టుకోలేక భవనం పైనుంచి దూకానని బాధితుడు వాపోయాడు. పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నానని చెప్పినా వినలేదని.. తీవ్రంగా కొట్టాడని బాధితుడు ఆరోపించాడు. తీవ్ర గాయాలైన సుబ్బారావును మెరుగైన చికిత్స కోసం గుంటూరులోని ఆస్పత్రికి పోలీసులు తరలించారు.

"చైన్​ స్నాచింగ్​ జరిగిందంట. విచారణ కోసం నన్ను తీసుకెళ్లారు. నేను కాదని చెప్పా.. సాయంత్రం వదిలేస్తా అన్నారు. అయినా చావకొట్టారు. గతంలో చోరీలు చేసేవాడిని.. ఇప్పుడు పనిచేసుకొని బతుకుతున్నా. పోలీసుల దెబ్బలు తట్టుకోలేకే.. స్టేషన్​ భవనంపైనుంచి దూకేశా. నేను ఎటువంటి తప్పూ చేయలేదు."

- బాధితుడు

'పోలీసుల దెబ్బలు తట్టుకోలేకే.. భవనం పైనుంచి దూకాను'

ఇదీచూడండి:

Last Updated : Jan 27, 2022, 9:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.