ETV Bharat / city

'కయ్యానికి కాళ్లు దువ్వేవాళ్లతో.. కాంట్రాక్టుల వియ్యమెందుకో'

నారాయణపేట్‌-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల 6న అపెక్స్ కౌన్సిల్ అజెండాలో చర్చించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంపీ రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన రేవంత్‌.. ఈ పథకాన్ని రాజకీయ దురుద్దేశంతోనే పక్కన పెట్టారని ఆరోపించారు.

mp revanth reddy letter to telangana chief minister kcr
సీఎం కేసీఆర్​కు ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ
author img

By

Published : Oct 1, 2020, 5:42 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​కి మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఈనెల 6న అపెక్స్ కౌన్సిల్​లో చర్చించాలని కోరారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పలు మార్లు లేఖలు రాసినట్లు పేర్కొన్న రేవంత్‌.. ఉమ్మడి రాష్ట్రంలోనే ఆమోదం పొందిన ఈ లిఫ్ట్ స్కీం తెలంగాణ హక్కు అని స్పష్టం చేశారు.

రాష్ట్ర సర్కార్ సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని తన లేఖకు కృష్ణానది యాజమాన్య బోర్డు సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. రాజకీయ దురుద్దేశంతోనే నారాయణపేట్‌-కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్నికేసీఆర్ పక్కన పెట్టారని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కయ్యానికి కాలుదువ్వుతోందని అంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు...ఆ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో సాగునీటి కాంట్రాక్టుల వియ్యమెందుకని ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉత్తి మాటలు కట్టిపెట్టి ఇప్పటికైనా.. గట్టి మేలు తలపెట్టాలని హితవు పలికారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.