హైదరాబాద్ ఎవరి సొంతం కాదని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. కొందరి ఆధిపత్యంలో ఉన్న నగరాన్ని భారతీయ జనతా పార్టీ.. తిరిగి అందరి నగరంగా మారుస్తుందని చెప్పారు. జీహెచ్ఎంసీలో విజయం సాధిస్తే.. భాజపా కార్పొరేటర్లు యజమానులుగా కాకుండా.. సేవకులుగా నగరవాసుల కష్టాలు తీరుస్తారని తెలిపారు.
పాత నగరాన్ని ఒవైసీ, మిగతా నగరాన్ని సీఎం చంద్రశేఖర్‌రావు పంచుకున్నారు. ఇది వాళ్ల సొంత ఆస్తిగా భావిస్తున్నారు. ఈ నగరాన్ని ప్రజలకు తిరిగి ఇవ్వాలనుకుంటున్నాం. ఇది ఒవైసీ నగరం కాదు.. చంద్రశేఖర్‌రావు నగరం కాదు. ఇది హైదరాబాద్.. తెలంగాణ ప్రజల నగరం. సొంత ఆస్తిగా మార్చుకున్నారో... దాన్ని తిరిగి హైదరాబాద్ ప్రజలకిస్తాం. నగరపాలికను మళ్లీ ప్రజావేదికగా మారుస్తాం. -దేవేంద్ర ఫడణవీస్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి
ఇవీ చూడండి: ఎల్ఆర్ఎస్ రద్దు, పాతబస్తీకి స్పెషల్ ప్యాకేజీ.. మేనిఫెస్టోలో భాజపా వరాలు