ETV Bharat / city

Shivaratri Celebrations in Telangana : శివాలయాలకు మహాశివరాత్రి శోభ - తెలంగాణలో మహాశివరాత్రి వేడుకలు

Shivaratri Celebrations in Telangana : తెలంగాణ వ్యాప్తంగా ఆలయాలన్నింటిలో ఇప్పటికే శివనామస్మరణ మార్మోగుతోంది. మహాశివరాత్రి సందర్భంగా శైవాలయాలన్నీ ముస్తాబయ్యాయి. వేడుకలు అంగరంగ వైభవంగా జరిపేందుకు కోవెలలన్ని సర్వం సిద్ధమయ్యాయి. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు జరగుతున్నాయి. శైవాలయాలల్లో భక్తుల రద్దీ పెరగనున్నందున ఆలయాల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Shivaratri Celebrations in Telangana
Shivaratri Celebrations in Telangana
author img

By

Published : Feb 28, 2022, 8:05 PM IST

Updated : Mar 1, 2022, 4:20 AM IST

శివరాత్రి వేడుకలకు ముస్తాబైన తెలంగాణ

Shivaratri Celebrations in Telangana : రాష్ట్రంలోని శైవాలయాలు మహాశివరాత్రి శోభను సంతరించుకున్నాయి. ఇవాళ శివరాత్రి కావడంతో ఆలయాను సర్వాంగ సుందరంగా ముస్తాబుచేశారు. తెల్లవారుజాము నుంచే శివనామస్మరణతో శైవక్షేత్రాలు మార్మోగుతున్నాయి.

రాజన్న గుడిలో శివరాత్రి సంబురం..

ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ రాజన్న సన్నిధి మహా జాతరకు ముస్తాబైంది. వేములవాడ పరిసర ప్రాంతాల్లో మహాశివరాత్రి సందడి కనిపిస్తోంది. ఆలయ దారి వెంట ప్రత్యేక అలంకరణలు, స్వాగత తోరణాలు ఆకట్టుకుంటున్నాయి. విద్యుద్దీపాలంకరణలో రాజన్న కోవెల దేదీప్యమానంగా వెలిగిపోతోంది. మూడ్రోజుల పాటు జరగనున్న జాతరను వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు.

శివరాత్రికి సిద్ధమైన వేయిస్తంభాల గుడి..

హనుమకొండలోని వేయి స్తంభాల ఆలయం వేడుకలకు సిద్ధమైంది. భక్తుల కోసం ప్రత్యేకఏర్పాట్లు చేశారు. ఎండవేడి తగలకుండా చలువ పందిళ్లు వేశారు. తెల్లవారుజాము నుంచే జాతర ప్రారంభం అవుతుందని అర్చకులు తెలిపారు.

ఐనవోలులో శివరాత్రి ఉత్సవాలు..

Shivaratri Celebrations at Inavolu Temple : ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శివరాత్రికి ఐదురోజులు భక్తిశ్రద్దలతో ఉత్సవాలు జరగనున్నాయి. ఒగ్గు పూజారులు వేసే పెద్ద పట్నం చూసేందుకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరుకానున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం ఉత్సవాలకు ముస్తాబైంది. జాతరలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు మొదలయ్యాయి. అగ్ని ప్రతిష్ట, రుద్రహవనం, ఊరేగింపు, ఎదురు కోలు సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ముస్తాబైన ఝరాసంఘం ఆలయం..

Shivaratri Celebrations at jharasangam : సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం కేతకీ సంగమేశ్వర ఆలయం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం తరఫున సంగమేశ్వరుడుకి మంత్రి హరీష్ రావు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సంగారెడ్డిలోని జ్యోతిర్వాస్తు విద్యా పీఠం ఆధ్వర్యంలో.. ప్రకృతి ప్రతిరూపమైన పరమశివున్ని.. పత్రాలతో మహా శివలింగంగా తీర్చిదిద్దారు. 220కిపైగా.. ఔషధ వృక్షాల నుంచి సేకరించిన 18కోట్ల ఆకులతో. 18 అడుగుల మహా శివలింగాన్ని తయారు చేశారు. హైదరాబాద్‌ శివారులోని బీరంగూడ శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయం ఉత్సవాలకు సిద్ధమైంది. మార్చి 4వ తేదీ వరకు జరిగే వేడుకల కోసం ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. హైదరాబాద్‌ శివారు కీసరగుట్ట క్షేత్రం మహాశివరాత్రి వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

శివరాత్రి జాతరకు మేళ్లచెరువు ముస్తాబు..

సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెరువు మహాశివరాత్రి జాతరకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మార్చి 1 నుంచి ఐదు రోజుల వరకు జరగనున్న ఈ జాతరకు ఐదు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశమున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు.

శివరాత్రి వేడుకకు ఈస్గాం సిద్ధం..

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ మండలంలోని ఈస్గాం మల్లన్న స్వామి ఆలయం మహాశివరాత్రి జాతరకు సర్వం సిద్ధమైంద. మూడ్రోజుల పాటు జరగనున్న ఈ జాతరకు వెళ్లే భక్తుల కోసం టీఎస్‌ఆర్టీసీ 15 ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. పెద్దఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

శివరాత్రి స్పెషల్ బస్సులు..

Shivaratri Special Buses in Telangana : వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండలం మందిపాల్‌లోని.. శ్రీ ఓంకారేశ్వర ఆలయం శివరాత్రికి సుందరంగా ముస్తాబైంది. ఖమ్మం జిల్లా మధిరలోని వైరా నది ఒడ్డున ఉన్న శివాలయంలో వేడుకల కోసం ఏర్పాట్లుపూర్తయ్యాయి. మహాశివరాత్రికి. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్‌సుఖ్‌నగర్, ఐఎస్ సదన్ సహా పలు ప్రాంతాల నుంచి శ్రీశైలం, వేములవాడ, కీసరగుట్ట, ఏడుపాయలు, బీరంగూడ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నారు.

Last Updated : Mar 1, 2022, 4:20 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.