హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో నూతనంగా ఏర్పాటు చేసిన బిర్యాని బ్లూస్ రెస్టారెంట్‌ను మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లోని ఐటీ ఉద్యోగులకు, వ్యాపారులకు, ప్రజలకు రెస్టారెంట్ అందుబాటులో ఉంటుందన్నారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రెస్టారెంట్ ఏర్పాటుపై సంతోషం వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు పాటించాలని నిర్వాహకులకు డీసీపీ సూచించారు.
ఇదీ చూడండి: కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్‌పై కేసు నమోదు