ETV Bharat / city

ఎల్​ఆర్​ఎస్​ దరఖాస్తులను త్వరగా పరిష్కరించేందుకు సర్కారు కసరత్తు - ఫీజు పూర్తిగా చెల్లిస్తే..

క్రమబద్దీకరణ ప్రక్రియలో తదుపరి దశ త్వరలో ప్రారంభం కానుంది. నిషేధిత జాబితాలో ఉన్నవాటిని మొదట్లోనే గుర్తించి తిరస్కరించనున్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని దరఖాస్తుల పరిష్కార కార్యాచరణ చేపట్టనున్నారు. ఇందుకోసం ఎల్ఆర్ఎస్ పోర్టల్ త్వరలోనే క్షేత్రస్థాయి అధికారులకు కూడా అందుబాటులోకి రానుంది.

lrs applications solvation program in telangana

author img

By

Published : Sep 22, 2020, 7:24 AM IST

అనధికార ప్లాట్లు, అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తుల పరిష్కార కార్యాచరణకు పురపాలక శాఖ శ్రీకారం చుడుతోంది. ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా వీటిని పరిష్కరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రక్రియకు అనుసరించాల్సిన విధానం, అందుబాటులోకి తీసుకురావాల్సిన సాంకేతిక పరిజ్ఞానంపై పురపాలక, పట్టణ ప్రణాళిక ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. సోమవారానికే రాష్ట్ర వ్యాప్తంగా మూడులక్షలకుపైగా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు వచ్చాయి. పురపాలక శాఖ మొదట్లో ఇచ్చిన జీవో ప్రకారం వచ్చే నెల 15 వరకు గడువు ఉంది. అయితే, గడువు పూర్తయ్యేవరకూ వేచి చూడకుండా త్వరలోనే తదుపరి ప్రక్రియను ప్రారంభించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రభుత్వ భూములు, కుంటలు, చెరువులు, శిఖం భూముల్లోనివి, నదులు, నాలాలు, కాలువలకు నిర్దేశించిన దూరంలో లేనివాటిని తొలిదశలోనే గుర్తించి తిరస్కరిస్తారు. ఈ పరిశీలనలో పొరపాట్లపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. పరిశీలన అధికారులను బాధ్యులుగా చేయనున్నారు.

ఫీజు పూర్తిగా చెల్లిస్తే..

తొలుత ప్రాథమిక దరఖాస్తు, రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్‌ మొదటి పేజీని మాత్రం తీసుకుంటున్నారు. అవి సక్రమంగా ఉంటేనే తదుపరి ప్రక్రియకు పరిగణిస్తారు. ప్రభుత్వ నిషేధిత భూముల జాబితా 22ఏలో లేని వాటినే పరిగణనలోకి తీసుకుంటారు. బృహత్‌ ప్రణాళిక ప్రకారం ఉందా? లేదా? అని నిర్ధారించుకుని దరఖాస్తుల పరిష్కార ప్రక్రియకు శ్రీకారం చుడతారు. నిబంధనలకు అనుగుణంగా ఉన్నవాటికి ఇతర నిర్దేశించిన డాక్యుమెంట్లను అందించడంతోపాటు, ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లింపునకు మూడు నెలల గడువు ఇస్తారు. ముందుగానే పూర్తి ఫీజు కట్టిన దరఖాస్తులను ప్రాధాన్యక్రమంలో పరిష్కరిస్తారు.

త్వరలో సమాచారం క్షేత్ర స్థాయికి

ఇంత వరకూ రాష్ట్రంలో నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, గ్రామపంచాయతీలవారీగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? అనే సమాచారం రాష్ట్ర పురపాలక శాఖ వద్దే ఉంది. ఈ నేపథ్యంలో తదుపరి ప్రక్రియలో కార్పొరేషన్లు, మున్సిపల్‌ కమిషనర్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తారు. దీని ఆధారంగా పరిశీలన ప్రక్రియను చేపట్టనున్నారు. రికార్డులు, క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ఎల్‌ఆర్‌ఎస్‌కు అనుమతిస్తారు.

అంచనాలను మించి అనధికార ప్లాట్లు, లే అవుట్లు

రాష్ట్రంలో అనధికార ప్లాట్లు, లే అవుట్లు అధికారుల అంచనాలకు మించి ఉన్నాయి. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల పరిధిలో నాలుగు లక్షల దాకా ఉంటాయని తొలుత అంచనా వేయగా.. ఆ సంఖ్య మరింత ఎక్కువ ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. గ్రామ పంచాయతీల పరిధిలో 12 లక్షలకుపైగా అనధికార ప్లాట్లు గుర్తించారు.

ఇదీ చూడండి: ధరణిలో పాత సమాచారమే.. మార్పు కోసం రైతుల ఎదురుచూపులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.