Low Temperature in Telangana : రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. జీహెచ్‌ఎంసీలోని 15 సర్కిళ్లలో సోమవారం 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా శేరిలింగంపల్లిలో 8.8 డిగ్రీలు, రాజేంద్రనగర్‌లో 9.9 డిగ్రీలు రికార్డయింది. మిగిలిన 13 సర్కిళ్లలో 10-15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. రానున్న రెండ్రోజులూ ఇదే పరిస్థితి ఉండనుంది. మూడో రోజు నుంచి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగి చలి తగ్గుతుందని పేర్కొంది.
Low Temperature in Telangana : రాష్ట్రంపై చలిపులి పంజా.. వణుకుతున్న జనం
Low Temperature in Telangana : రాష్ట్రంలో చలిపులి పంజా విసురుతోంది. చలి తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. రాత్రి వేళల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనాలు వణికిపోతున్నారు. సాయంత్రం అయిందంటే ఇంటి నుంచి బయట కాలుపెట్టలేని పరిస్థితి నెలకొంది.