ETV Bharat / city

AP RAINS: రానున్న 24 గంటల్లో అల్పపీడనం.. ఇవాళ, రేపు భారీ వర్షాలు - ఒడిశా-ఉత్తరాంధ్ర

ఏపీలో రానున్న 24 గంటల్లో వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని వల్ల ఆంధ్రప్రదేశ్​లో భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది.

low-pressure-and-chance-of-heavy-rains-today-and-tomorrow

author img

By

Published : Aug 17, 2021, 12:26 AM IST

ఆంధ్రప్రదేశ్​లో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుందని విపత్తు నిర్వహణశాఖ తెలిపింది. ఒడిశా - ఉత్తరాంధ్ర తీరం వెంబడి.. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఏపీలో ఇవాళ, రేపు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తు నిర్వహణశాఖ ప్రకటించింది. తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని.. జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లవద్దు హెచ్చరించింది.

ఇదీ చదవండి:

CM KCR: ప్రభుత్వ ఉద్యోగులకూ దళితబంధు.. కాంట్రాక్టుల్లోనూ రిజర్వేషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.