బంధువుల నుంచి ప్రాణాలకు హాని ఉందని ఓ ప్రేమజంట హైకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 14వ తేదీన ఆ జంట ఏపీలోని కాణిపాకంలో ప్రేమ వివాహం చేసుకుంది. అయితే యువతీ తరఫు బంధువుల నుంచి ప్రాణహాని ఉందని.. ఆ వధూవరులు హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా బంధువులు కూడా ఫిర్యాదు చేయగా.. గుంటూరులోని పెదకాకాని రెయిన్ ట్రీ పార్క్ విల్లాస్ వద్ద ఉన్న ఆ ప్రేమ జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిది కడప జిల్లా సాంబేపల్లి మండలం దిగువ నల్లగుట్ట గ్రామంగా తెలిసింది.
ఇదీ చదవండి: REVANTH REDDY: ప్రగతి భవన్‌ను.. ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే కర్మాగారంగా మారుస్తాం..!