ETV Bharat / city

love marriage: ప్రేమ పెళ్లి.. అంతలోనే తల్లిదండ్రుల ఎంట్రీ.. ఆ తర్వాత..! - కాకినాడలో ప్రేమ వివాహం లో ఘర్షణ

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కనిపించిన దృశ్యం చూపరులను కలచివేసింది. ఓ ప్రేమ జంట వివాహం చేసుకుని తల్లిదండ్రులను కాదని వెళ్లిపోతున్న దృశ్యాలు కంటతడిపెట్టిస్తున్నాయి. నవమాసాలు మోసి, కనిపెంచిన తల్లిదండ్రుల ఆరాటం.. తమ అందమైన భవిష్యత్ కోసం తపన పడే ప్రేమికుల పోరాటం.. కారణం ఏదైనా ఈ దృశ్యాలు ప్రతి గుండెను పిండేస్తున్నాయి. ఈ వీడియో ఇప్పుడు చర్చాశనీయంగా మారింది.

love marriage: రిజిస్ట్రార్ ఆఫీస్​లో ప్రేమ పెళ్లి.. సడెన్​గా అమ్మాయి తల్లిదండ్రుల ఎంట్రీ.. ఆ తర్వాత..!

author img

By

Published : Aug 27, 2021, 8:25 PM IST

అమ్మ, నాన్న, ఓ కూతురు.. ఎంతో ఆనందంగా సాగిపోతున్న వారి కుటుంబంలో ప్రేమ కలవరం రేపింది. అల్లారుముద్దుగా చూసుకుంటున్న కూతురు.. వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్పడంతో అలజడి రేగింది. జీవితాంతం తోడుగా ఉంటానని బాస చేసిన ప్రేమికుడు ఓ వైపు.. జీవితాన్నే తన కోసం దారబోసిన తల్లిదండ్రులు మరోవైపు. ఈ పరిస్థితుల నడుమ ఆ యువతి మానసికంగా నలిగిపోయింది.

love marriage: రిజిస్ట్రార్ ఆఫీస్​లో ప్రేమ పెళ్లి.. సడెన్​గా అమ్మాయి తల్లిదండ్రుల ఎంట్రీ.. ఆ తర్వాత..!

ముక్కూమొహం తెలియని వ్యక్తి.. తమ కూతురుని బాగా చూసుకుంటాడా..? లేదా.. ? అనే సంశయంతో కన్నబిడ్డ ప్రేమ వివాహానికి ఒప్పుకోలేదు ఆ తల్లిదండ్రులు. ఏ నాటికైనా తల్లిదండ్రుల మనసు మారి, తన కుటుంబాన్ని చేరదీస్తారని భావించిన ఆ తనయ.. ప్రేమ పెళ్లి చేసుకునేందుకు నిశ్చయించుకుంది. ప్రియుడితో కలిసి నేరుగా సబ్​ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి వివాహానికి సిద్ధమైంది. కొందరు స్నేహితుల మధ్య వీరి వివాహ క్రతువు ముగిసింది.

విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకున్నారు. కూతురును అడ్డుకుని ఇంటికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. భర్తను వదిలి తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు నిరాకరించిన ఆ యువతి.. భర్త వద్ద ఉండేందుకు సిద్ధమైంది. ఉద్రిక్త ఘటనల మధ్య నవ వధువును తన తల్లిదండ్రుల నుంచి వరుడు తీసుకెళ్లాడు. కూతురు తమను విడిచి వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. ఆంధ్రప్రదేశ్​లోని కాకినాడలో జరిగిన ఈ ఘటన స్థానికులను కలచివేసింది.

ఇదీ చదవండి: DIAL 100: 'నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు.. ఆపండి సార్'..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.