ETV Bharat / city

తిరుమల శ్రీవారి ప్రయోగాత్మక దర్శనం ప్రారంభం

సుమారు 80 రోజుల తర్వాత.. శ్రీనివాసుని వైభవాన్ని కనులారా చూడాలన్ని కోరిక నేరవేరింది. లాక్​డౌన్​ ప్రారంభమయిన నుంచి ఏకాంతంగా పూజలందుకున్న కలియుగ వైకుంఠనాథుడు.. ఇవాళ భక్తులను కనువిందు చేశాడు. ప్రయోగాత్మక దర్శనాల్లో భాగంగా... ఇవాళ ఆలయ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులను అనుమతిచ్చారు. 11 నుంచి రాష్ట్రవ్యాప్తంగా భక్తులకు వెంకన్న దర్శనం కల్పించనుంది. ఏపీ రాష్ట్ర సరిహద్దులు ఇంకా తెరవకపోవడం వల్ల ఇతర రాష్ట్రాల భక్తులు శ్రీవారి దర్శనానికి మరికొంత రోజులు వేచిచూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.

tirumala
తిరుమల శ్రీవారి ప్రయోగాత్మక దర్శనం ప్రారంభం
author img

By

Published : Jun 8, 2020, 7:12 AM IST

Updated : Jun 8, 2020, 8:39 AM IST

కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా మార్చి 20 నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలోకి భక్తుల ప్రవేశం నిలిపివేసిన తితిదే... నిబంధనల సడలింపుతో నేటి నుంచి ప్రయోగాత్మకంగా దర్శనాలను పునఃప్రారంభించింది. ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో దర్శనాలకు అనుమతిస్తూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సడలింపులతో నేటి నుంచి శ్రీవారి దర్శనాలు ప్రారంభమయ్యాయి. కరోనా ప్రొటోకాల్ ప్రకారం.... వైరస్ వ్యాప్తి నియంత్రణకు తితిదే పకడ్బందీ చర్యలు తీసుకుంది. అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి శ్రీవారి సన్నిధి వరకు పటిష్ఠ చర్యలు చేపట్టింది. భక్తుల మధ్య భౌతిక దూరం, శుభ్రత తప్పనిసరి చేసింది.

థర్మల్ స్క్రీనింగ్.. తనిఖీలు

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను అలిపిరి తనిఖీ కేంద్రంలో నిశితంగా పరిశీలించేలా... థర్మల్ స్క్రీనింగ్ సహా... వాహనాల తనిఖీలకూ ఏర్పాట్లు చేశారు. దర్శనానికి టికెట్లున్న వారిని మాత్రమే తిరుమలకు అనుమతిస్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, శ్రీ‌వారి ఆల‌యం, అన్నప్రసాద భ‌వ‌నం, క‌ల్యాణ‌క‌ట్ట ప్రాంతాల్లో.... భౌతిక దూరం పాటించేలా... మార్కింగ్ చేశారు. భ‌క్తుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు వివిధ ప్రాంతాల్లో 3 భాషల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. భ‌క్తుల‌కు దగ్గర‌గా సేవ‌లందించే సిబ్బంది కోసం.... పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచారు. వెంగమాంబ అన్నదాన సత్రంలో వెయ్యి మంది సామర్థ్యం ఉన్న ఒక్కో హాలుకు... 200 మందిని మాత్రమే అనుమతించడం... క‌ల్యాణ‌క‌ట్టల్లో క్షుర‌కుల మ‌ధ్య 10 అడుగుల దూరంతో పాటు అవసరమైన ప్రతిచోటా విస్తృత ఏర్పాట్లు చేశారు.

11నుంచి భక్తులందరికీ..

దర్శనాలను ప్రయోగాత్మకంగా ప్రారంభించిన తితిదే... భౌతిక దూరం పాటిస్తూ దర్శనం కల్పించడంలో సాధక బాధకాలను గుర్తించడంపై దృష్టి పెట్టింది. ఇందుకుగానూ తొలి రెండు రోజుల పాటు తితిదే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు... దర్శనానికి అనుమతి ఇచ్చింది. ఈనెల 11 నుంచి భక్తులందరికీ దర్శనం కల్పించనున్నారు. ఇందులో మూడు వేల మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం, మరో 3 వేల మందికి సాధారణ దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశారు.

జూన్ నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా... ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌, బస్టాండ్‌, శ్రీనివాసం ప్రాంతాల్లో నేరుగా వచ్చే భక్తులకు సర్వదర్శనం టికెట్లను ఇవ్వనున్నారు. ప్రతి రోజు ఉదయం ఆరున్నర గంటలకు ప్రారంభమయ్యే దర్శనాలు... రాత్రి ఏడున్నర వరకు కొనసాగేలా చర్యలు చేపట్టారు. గంటకు ఐదు వందల మంది చొప్పున... రోజుకు ఆరు వేల మందికి శ్రీవారి దర్శన భాగ్యం కల్పించనున్నారు.

ఇవీచూడండి: అన్​లాక్​ 1.0: ఆతిథ్యం, పర్యటకం షురూ

Last Updated : Jun 8, 2020, 8:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.