Lokesh Fires on Jagan : గుంటూరు జిల్లా కంతేరుకు చెందిన ఎస్సీ మహిళపై వైకాపా నేతల దాడిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. వెంకాయమ్మకి సమాధానం చెప్పే దమ్ములేకనే కంతేరులోని ఆమె ఇంటిపై దాడిచేసి బెదిరించారని మండిపడ్డారు. జగన్ పాలనలో పేదల పరిస్థితిని కుండబద్దలు కొట్టినట్టు వెంకాయమ్మ చెప్పారని, ఆ వీడియోను లోకేశ్ విడుదల చేశారు. వెంకాయమ్మ, ఆమె కుటుంబ సభ్యులకు ఎటువంటి హాని తలపెట్టినా తీవ్రపరిణామాలు తప్పవని హెచ్చరించారు.
-
వెంకాయమ్మకి గానీ, ఆమె కుటుంబసభ్యులకి గానీ ఎటువంటి హాని తలపెట్టినా తీవ్రపరిణామాలు తప్పవు. మీ దగ్గర వున్నది కిరాయి మూకలు..మా దగ్గర ఉన్నది పార్టీ అంటే ప్రాణం పెట్టే లక్షలాది మంది సైనికులు.(2/3)
— Lokesh Nara (@naralokesh) May 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">వెంకాయమ్మకి గానీ, ఆమె కుటుంబసభ్యులకి గానీ ఎటువంటి హాని తలపెట్టినా తీవ్రపరిణామాలు తప్పవు. మీ దగ్గర వున్నది కిరాయి మూకలు..మా దగ్గర ఉన్నది పార్టీ అంటే ప్రాణం పెట్టే లక్షలాది మంది సైనికులు.(2/3)
— Lokesh Nara (@naralokesh) May 17, 2022వెంకాయమ్మకి గానీ, ఆమె కుటుంబసభ్యులకి గానీ ఎటువంటి హాని తలపెట్టినా తీవ్రపరిణామాలు తప్పవు. మీ దగ్గర వున్నది కిరాయి మూకలు..మా దగ్గర ఉన్నది పార్టీ అంటే ప్రాణం పెట్టే లక్షలాది మంది సైనికులు.(2/3)
— Lokesh Nara (@naralokesh) May 17, 2022
వైకాపా దగ్గర ఉన్నది కిరాయి మూకలైతే.. తెదేపా దగ్గర ఉన్నది పార్టీ అంటే ప్రాణం పెట్టే లక్షలాది మంది సైనికులని లోకేశ్ స్పష్టం చేశారు. నిరక్షరాస్య, నిరుపేద, ఎస్సీ మహిళ వెంకాయమ్మ మాటే ఏపీలో ప్రతి ఇంటా, ప్రతి నోటా వినిపిస్తోందన్నారు. 5 కోట్ల మందిపైనా జగన్ రెడ్డి దాడి చేయిస్తారా అని లోకేశ్ నిలదీశారు.