పత్రికా స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ ప్రభుత్వం అనేక హింసాత్మక చర్యలకు పాల్పడుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. జర్నలిస్టు వెంకట నారాయణ ఇంటిపై దాడే అందుకు ఉదాహరణ అన్నారు.
పత్రికా స్వేచ్ఛని హరించేలా జగన్‌రెడ్డి జీఓ తెచ్చారని... ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. వైకాపా నాయకుల అవినీతి, దందాలపై వార్త రాస్తే దాడులకు దిగుతున్నారని లోకేశ్ మండిపడ్డారు.
-
Shocked to see Peddireddy Ramachandra Reddy’s men attack the house of journalist Venkata Narayana & vandalize his property. The goons threatened to douse the family with petrol & burn them alive. This was in retaliation for exposing Om Pratap’s death & YSRCP sand mafia (1/3) pic.twitter.com/nMihJPHVJJ
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) August 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Shocked to see Peddireddy Ramachandra Reddy’s men attack the house of journalist Venkata Narayana & vandalize his property. The goons threatened to douse the family with petrol & burn them alive. This was in retaliation for exposing Om Pratap’s death & YSRCP sand mafia (1/3) pic.twitter.com/nMihJPHVJJ
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) August 31, 2020Shocked to see Peddireddy Ramachandra Reddy’s men attack the house of journalist Venkata Narayana & vandalize his property. The goons threatened to douse the family with petrol & burn them alive. This was in retaliation for exposing Om Pratap’s death & YSRCP sand mafia (1/3) pic.twitter.com/nMihJPHVJJ
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) August 31, 2020
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు జర్నలిస్ట్ వెంకట నారాయణ ఇంటిపై దాడి చేయటాన్ని లోకేశ్ తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టు ఇంటిని ధ్వంసం చేయడం చూసి షాక్‌కి గురయ్యానన్న లోకేశ్... ఆ గూండాలు కుటుంబాన్ని పెట్రోల్‌తో పోసి సజీవ దహనం చేస్తామని బెదిరించారన్నారు.
ఓం ప్రతాప్ మరణం, వైకాపా ఇసుక మాఫియాను బహిర్గతం చేసినందుకు ఇది ప్రతీకార చర్యగా పేర్కొన్నారు. తమను తాము కాపాడుకునేందుకు భయంతో ఆ కుటుంబం ఇంటి లోపలికి వెళ్లి తాళం వేసుకుందన్నారు.
అధికార పార్టీ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందనటానికి రుజువన్న ఆయన... ఇది చట్ట వ్యతిరేకమైన చర్య అని అన్నారు. దాడికి సంబంధించిన వీడియోను లోకేశ్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రాజకీయ జోక్యం లేకుండా నేరస్థులను శిక్షించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: మాజీ మంత్రి అచ్చెన్నకు కరోనా నెగెటివ్