ETV Bharat / city

Lokesh: 'ఎన్ని కేసులు పెట్టినా.. నన్ను ఏం చేయలేరు'

Lokesh attended court: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. ఏపీలోని విజయవాడ మొదటి అదనపు మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. 2020లో అచ్చెన్న అరెస్టు సమయంలో లోకేశ్ అ.ని.శా. కోర్టు వద్దకు రాగా.. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా ఆయన న్యాయస్థానానికి హాజరయ్యారు. తనపై ఇప్పటికే 14 కేసులు పెట్టారని.. మరో 10 కేసులు పెట్టుకున్నా.. ఏం చేయలేరని లోకేశ్ అన్నారు.

Lokesh: 'ఎన్ని కేసులు పెట్టినా.. నన్ను ఏం చేయలేరు'
Lokesh: 'ఎన్ని కేసులు పెట్టినా.. నన్ను ఏం చేయలేరు'
author img

By

Published : May 23, 2022, 2:17 PM IST

Lokesh attended court: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ మొదటి అదనపు మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. ఓ కేసు విచారణలో భాగంగా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. 2020లో అచ్చెన్న అరెస్టు సమయంలో.. లోకేశ్ అ.ని.శా. కోర్టు వద్దకు వచ్చారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ.. అప్పట్లో లోకేశ్‌, కొల్లు రవీంద్ర, జాస్తి సాంబశివరావు , తెలుగు యువత దేవినేని చందుపై కేసు పెట్టారు.

Lokesh: 'ఎన్ని కేసులు పెట్టినా.. నన్ను ఏం చేయలేరు'

ఈ కేసుకు సంబంధించి ఇవాళ లోకేశ్‌తో పాటు కొల్లు రవీంద్ర కోర్టుకు హాజరయ్యారు. లోకేశ్​ కోర్టు హాజరు సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రహదారులు దిగ్బంధించి.. తెదేపా నేతలను అడ్డుకున్నారు. పోలీసుల తీరు పట్ల పార్టీ నేతలు మండిపడ్డారు.

పార్టీ నేతల ఆగ్రహం..: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎమ్మెల్సీ అనంత బాబుని పట్టుకోలేని పోలీసులు.. తమపై జులుం ప్రదర్శిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు. అతి చేసే పోలీసులకు పరిణామాలు తప్పవని హెచ్చరించారు. జగన్​లా అవినీతి కేసుల్లో లోకేశ్​ కోర్టు మెట్లక్కలేదని తెలిపారు. గంజాయి దొంగలతో కుమ్మకైన పోలీసులు అమాయికులను వేధిస్తున్నారని తెదేపా పొలిట్​బ్యూరో సభ్యులు బోండా ఉమా దుయ్యబట్టారు. వైకాపా కండువా వేసుకున్న పోలీసులు ఇబ్బందులు పడక తప్పదని స్పష్టం చేశారు.

వైకాపా ప్రభుత్వంపై నారా లోకేశ్​ ధ్వజం..: ఎన్నో కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డానని తనపై అసత్య ఆరోపణలు చేసి.. చివరికు కొవిడ్ నిబంధనల ఉల్లంఘనల కేసులో కోర్టుకు తీసుకొచ్చారని లోకేశ్​ మండిపడ్డారు. ఇప్పటి వరకు తనపై 14 కేసులు పెట్టి ఏం సాధించారని నిలదీశారు. కావాలంటే మరో 10 కేసులు పెట్టుకోండన్నారు. ఏ తప్పు చేయలేదు కాబట్టే నేను కోర్టుకొచ్చా.. సీఎంలా వాయిదాలు తీసుకోవట్లేదని వ్యాఖ్యానించారు. ప్రజలు రాళ్లతో కొట్టించుకునే పరిస్థితి జగన్​మోహన్​రెడ్డి తెచ్చుకుంటున్నారని అన్నారు. 2016 నుంచి నాపై చేసిన అవినీతి ఆరోపణలపై చర్చకు సిద్ధమన్నారు. తన అవినీతి కేసులపై చర్చకు జగన్ సిద్ధమా అని సవాల్​ విసిరారు.

సొంత పార్టీ కార్యకర్తలపైనే దాడులు..: తెదేపా నేతలతో పాటు దళిత ప్రజలపై వైకాపా దాడులకు తెగబడుతోందని లోకేశ్​ విమర్శించారు. తాజాగా సొంత కార్యకర్తలపైనే దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. సొంత పార్టీ కార్యకర్తను కొట్టి చంపేసినా.. ఆ కుటుంబాన్ని కాపాడలేని పరిస్థితిలో జగన్ ఉన్నారన్నారు. 72 గంటల్లో ఎమ్మెల్సీ అనంతబాబు సజ్జల సహా వైకాపా ముఖ్య నేతలను కలిశారని ఆరోపించారు. ఎమ్మెల్సీ అనంత బాబు తాడేపల్లి ప్యాలెస్​లోనే ఉన్నాడా అని ప్రశ్నించారు. తాను కోర్టుకు వస్తే.. 500 మంది పోలీసులు వచ్చారన్న ఆయన.. తన చుట్టూ తిరిగే పోలీసులు ఎమ్మెల్సీ అనంత బాబుని పట్టుకోవాలన్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.. సుబ్రహ్మణ్యం కుటుంబానికి రూ.2 కోట్లు, పొలం ఇస్తానని ప్రలోభ పెట్టారని ఆరోపించారు.

మంత్రులపై మండిపాటు.. పోలవరం పూర్తి చేస్తానంటూ సవాళ్లు చేసిన ఓ మంత్రి.. నేడు తనకు సంబంధం లేదంటున్నారని నారా లోకేశ్​ మండిపడ్డారు. జల వనరులపై అవగాహన లేని మరో వ్యక్తి ఇప్పుడు మంత్రి అయ్యాడని విమర్శించారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటన వైకాపా పొలిట్ బ్యూరో సమావేశంలా ఉందని ఎద్దేవా చేశారు. అదానీని కలిసేందుకు దావోస్ దాకా వెళ్లారు అని విమర్శించారు. జగన్ రెడ్డి దేశం వదిలి వెళ్లాక పెట్రోల్ ధరలు తగ్గాయన్నారు. చంద్రబాబు హయాంలో ఎన్నో పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయని గుర్తు చేశారు. జగన్ రెడ్డి రాష్ట్రానికి తెచ్చిన ఒక్క పరిశ్రమ అయినా చెప్పగలరా అని నిలదీశారు.

ఇవీ చదవండి..:

బెల్ట్​షాప్​లో మద్యం కొనలేదని జరిమానా విధించినందుకు ఆ వ్యక్తి ఏం చేశాడంటే..

గన్​తో బెదిరించి రేప్​.. కారుణ్య మరణానికి బాధితురాలి విజ్ఞప్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.