ఏపీ ఎంపీ రఘురామ కుటుంబసభ్యుల ఫిర్యాదుపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. వారి ఫిర్యాదును సభాహక్కుల కమిటీకి పంపారు. రఘురామ అంశంపై వెంటనే నివేదిక ఇవ్వాలని స్పీకర్ కార్యాలయం.. హోంశాఖను కోరింది. ఈ మేరకు రఘురామ కుటుంబీకుల ఫిర్యాదు కాపీని హోంశాఖకు పంపారు.
నిన్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను ఎంపీ రఘురామకృష్ణరాజు కుటుంబసభ్యులు కలిశారు. రఘురామ సతీమణి రమాదేవి, కుమారుడు భరత్, కుమార్తె ఇందూ ప్రియదర్శిని స్పీకర్‌తో భేటీ అయ్యారు. రఘురామకృష్ణరాజును వైకాపా ప్రభుత్వం వేధిస్తోందని వారు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. రఘురామపై రాజద్రోహం కింద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారన్నారు.
ఇవీ చూడండి: గుజరాత్ సొసైటీ కేసు ఆధారంగా బెయిల్ పిటిషన్ కొట్టివేయాలి: దవే