ETV Bharat / city

Lock Down : సడలింపు సమయంలో కిటకిట.. లాక్​డౌన్​లో స్తబ్ధత

తెలంగాణలో లాక్​డౌన్ ఆంక్షలు పటిష్ఠంగా అమలవుతున్నాయి. సడలింపు సమయంలో రహదారులన్ని కిక్కిరిసిపోతున్నాయి. లాక్​డౌన్ మొదలవ్వగానే.. రోడ్లన్ని నిర్మానుష్యంగా మారుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.

lockdown, telangana lockdown, lockdown in telangana
లాక్​డౌన్, తెలంగాణ లాక్​డౌన్, తెలంగాణలో లాక్​డౌన్ 2021
author img

By

Published : Jun 3, 2021, 1:59 PM IST

రాష్ట్రంలో లాక్​డౌన్​ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత రహదారులపైకి వస్తున్న వారిపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు.

హైదరాబాద్​ నగరంలో ఉదయం 6 నుంచే కిటికిట మొదలైనా.. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2 గంటల వరకు వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటోంది. అధికారులు.. కూడళ్ల వద్ద అదనపు ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. సడలింపు సమయంలో అంబులెన్స్​లు ట్రాఫిక్​లో చిక్కుకుంటున్నాయి. రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి.

2 కొట్టగానే.. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన రోడ్లపైకి వచ్చిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వాహనాలు సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేస్తున్నారు.

కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​ నిబంధనలను ప్రజలంతా పాటించాలని పోలీసులు సూచించారు. ఇంట్లోనే ఉండి తమకు సహకరించాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.