ETV Bharat / city

లాక్​డౌన్​ ఎఫెక్ట్​: జనాలతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిట

author img

By

Published : May 12, 2021, 5:20 PM IST

రాష్ట్రంలో లాక్​డౌన్​ నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థకు నాలుగు గంటలు మాత్రమే అనుమతి ఇవ్వడం వల్ల రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో రద్దీగా మారిపోయాయి. ప్రజలు భారీగా తరలిరావడం వల్ల సరిపడా బస్సులు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. పది గంటల లోపు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ప్రారంభమైన ప్రయాణికులను మాత్రమే గమ్యస్థానాల వరకు చేరవేస్తామని ఆర్టీసీ ప్రకటించింది.

lock down effect on transportation in hyderabad

లాక్​డౌన్ మినహాయింపు సమయాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకుంటున్నారు. నాలుగు గంటల పాటు ప్రయాణానికి వెసులుబాటు కల్పించడం వల్ల సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారు పెట్టేబేడా సర్ధుకుని బయలుదేరారు. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్​లు ప్రయాణికులతో సందడిగా మారిపోయాయి. ఒక్క బస్సు వచ్చినా.. ప్రయాణికులు పరుగెత్తుకుంటూ వచ్చి వాలిపోయారు. జిల్లాలకు వెళ్లే బస్సులతో పాటు, నగరంలో సైతం నాలుగు గంటలపాటు సిటీ బస్సులు తిరిగాయి. సిటీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య రోజు వారితో పోల్చితే.. తగ్గినట్లు ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ప్రధాన ప్రాంతాలన్నింటిలో సిటీ బస్సులను అందుబాటులో ఉంచామని తెలిపారు. లాక్​డౌన్ మినహాయింపు సమయం ముగియగానే సిటీ బస్సులన్నీ... ఆయా డిపోలకు చేరుకున్నాయి. పది గంటలలోపు జిల్లాలకు వెళ్లే బస్సులను ఆయా ప్రాంతాల వరకు చేరుకునే వరకు పోలీసులు అనుమతించారు.

అంతరాష్ట్ర ఆర్టీసీ సర్వీసులు, ప్రైవేటు వాహనాలను సైతం పది గంటల తర్వాత అనుమతించడంలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అంతరాష్ట్ర సర్వీసులు, ప్రైవేట్ బస్సుల రాకపోకలను లాక్​డౌన్ సమయంలో నిలిపివేశారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్​లో కర్ఫ్యూ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి నడిపించే బస్సులను టీఎస్​ఆర్టీసీ ఇప్పటికే రద్దు చేసింది. ఏపీకి వెళ్లే కార్గో, కొరియర్ సర్వీసులను సైతం టీఎస్​ఆర్టీసీ నిలిపివేసింది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు కూడా బస్సులు నడపడంలేదు. రాష్ట్రంలోనూ కేవలం నాలుగు గంటలపాటు మాత్రమే బస్సులు అందుబాటులో ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణానికి ప్రణాళికలు వేసుకోవాలని ప్రయాణికులకు ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది.

సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్ రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడిపోయాయి. రైలు బయలుదేరే కంటే గంట ముందు మాత్రమే రైల్వేస్టేషన్లలోకి అనుమతించడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. "లాక్​డౌన్ వల్ల పోలీసులు బయట ఉండనివ్వడంలేదు. లోపలికి రైల్వే అధికారులు అనుమతించటం లేదు. దూర ప్రాంతాల నుంచి రావాలంటే.. ఏదో ఒక ప్రైవేట్ వాహనంలో రావాలి. కాబట్టి కొంచెం ముందుగానే రావాల్సి ఉంటుంది. అలా వస్తే... ఇలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది" అంటూ రైల్వే ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైల్వేస్టేషన్లలో టికెట్ ఉన్న ప్రయాణికులను అనుమంతించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రయాణికులు ఏ రాష్ట్రానికి వెళుతున్నారో.. ఆయా రాష్ట్రాల నియమనిబంధనలు పాటించాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి దిల్లీ వెళ్లాలనుకునే రైల్వే ప్రయాణికులు కచ్చితంగా కరోనా నెగిటివ్ రిపోర్ట్ లేదంటే...72 గంటల సమయంలో తీసుకున్న ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్టులను, రెండో డోస్ టీకా వేసుకున్న సర్టిఫికెట్​ను తీసుకుని వెంట ఉంచుకోవాలని రైల్వేశాఖ విజ్ఞప్తి చేస్తుంది. మాస్కులు ఉన్న వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తున్నారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి గతంలో 225కు పైగా రైళ్లు నిత్యం 2.50 లక్షల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేర్చేది. గత ఏడాది లాక్​డౌన్ తర్వాత రైళ్ల సంఖ్యను దక్షిణ మధ్య రైల్వే కుదించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి గతంలో నడిపే రైళ్లతో పోల్చితే... 80శాతం రైళ్లను మాత్రమే నడుపుతున్నామని ద.మ.రైల్వే ప్రకటించింది. రిజర్వేషన్ టికెట్ ఉన్న వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తున్నామని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

క్యాబ్​లు, ఆటోలు, ప్రైవేట్ ట్రావెల్స్​ను సైతం పది గంటల తర్వాత పోలీసులు అనుమతించడంలేదు. రైల్వేస్టేషన్ నుంచి టికెట్ ఉన్న ప్రయాణికులను మాత్రమే క్యాబ్​లు, ఆటోల్లో వెళ్లేందుకు అనుమతిస్తున్నారు.

ఇదీ చూడండి: తెలంగాణకు తాళం.. కొనసాగుతున్న లాక్‌డౌన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.