హైదరాబాద్ మెహదీపట్నం వద్ద ఆసిఫ్‌నగర్ ఏసీపీ శివమారుతి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించి ఉదయం10 గంటలు దాటిన తర్వాత రహదారులపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేశారు. మొదటి రోజున 86 వాహనాలు జప్తు చేసి 247 మందిపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ శివ తెలిపారు.
గురువారం ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చిన సుమారు 60 కేసులు నమోదు చేసినట్లు ఏసీపీ వెల్లడించారు. లాక్డౌన్ నియమాలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
- ఇదీ చూడండి: కూలీల కొరతతో సన్నకారు రైతుల సతమతం