Lizard in Biryani: హైదరాబాద్‌లో ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని బావర్చి బిర్యానీ సెంటర్ ఎంత ఫేమసో.. కేవలం నగరవాసులకే కాదు దేశవిదేశాల్లోని బిర్యానీ ప్రియలందరికీ తెలుసు. అయితే... ఇప్పుడు ఆ బావర్చి నుంచి తీసుకొచ్చిన బిర్యానీలో బల్లి రావటం సర్వత్రా చర్చనీయాంశమైంది. రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ రవిచారి.. బావర్చి హోటల్ నుంచి బిర్యానీ పార్శిల్ తెప్పించుకున్నారు. ఘుమఘుమలాడుతోన్న బిర్యానీని ప్లేట్లో వడ్డించుకుని.. ఆస్వాదిస్తూ ఆరగిస్తున్నారు.
సగం వరకు తిన్న తర్వాత.. ప్లేట్లో ఏదో తేడాగా ఓ ఆకారం కనిపించింది. తినటం ఆపేసి.. ఏంటా అని పరికించి చూసిన రవిచారి ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఎందుకంటే.. అది అచ్చంగా బల్లి. అంతవరకు ఎంతో ఇష్టంగా ఆరగించిన బిర్యానీలో బల్లి కనిపించటంతో.. కడుపులో మొత్తం తిప్పినట్టైంది. వెంటనే.. ప్లేట్లో ఉన్న ఆ చనిపోయిన బల్లిని వీడియో తీసిన కార్పొరేటర్.. చిక్కడపల్లి పోలీసులు, జీహెచ్ఎంసీ ఫుడ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
రవిచారి ఫిర్యాదుతో.. పోలీసులు, అధికారులు హోటల్‌కు చేరుకుని వంటగదిని తనిఖీ చేశారు. బిర్యానీ ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు.. నమూనాలను పరీక్ష నిమిత్తం నాచారం ఫుడ్ కంట్రోల్ ల్యాబ్‌కు పంపించారు. బావర్చి హోటల్‌కు షోకాజు నోటీసులు జారీ చేశారు.
ఇవీ చూడండి: