ETV Bharat / city

33 వేల మద్యం బాటిళ్లు ధ్వంసం.. ప్రొక్లైనర్​ ఎక్కించి మరీ..! - ఏలూరు తాజా వార్తలు

Liquor Destroy: ఏపీలోని ఏలూరు జిల్లావ్యాప్తంగా పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యాన్ని.. పోలీసులు ధ్వంసం చేశారు. మొత్తం 33,933 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకోగా.. వాటి విలువ సుమారు రూ.80లక్షలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.

liquor-destroyed-by-police-at-eluru-district

author img

By

Published : Jun 30, 2022, 7:39 PM IST

Liquor Destroy: ఏపీలోని ఏలూరు జిల్లావ్యాప్తంగా పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యాన్ని.. పోలీసులు నాశనం చేశారు. జిల్లాలోని 7 ఎస్‌ఈబీ సర్కిళ్ల పరిధిలో.. 2021 నుంచి 2022 మార్చి వరకు 1,083 అక్రమ మద్యం కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 33,933 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకోగా.. ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ ఎదురుగా ఆటోనగర్ రైల్వే క్వార్టర్స్‌ వద్ద వాటిని ధ్వంసం చేశారు. ఈ మొత్తం బాటిళ్ల విలువు రూ.80లక్షలుగా పోలీసులు తెలిపారు. మరో 70వేల మద్యం బాటిళ్లను త్వరలోనే ధ్వంసం చేయనున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు.. చెక్​పోస్టులు, ఇతర ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించి అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నట్లు.. జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రజల ఆరోగ్యాలకు హానికలిగించే నాటు సారా తయారీ కేంద్రాలపై ఉక్కుపాదం మోపుతామని , నాటుసారా తయారీకి ఉపయోగించే సామాగ్రిని సరఫరా చేసే వారిపై చర్యలు చేపడతామన్నారు. అక్రమ మద్యం విక్రయిస్తే.. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు పరుస్తామని హెచ్చరించారు.

33 వేల మద్యం బాటిళ్లు ధ్వంసం.. ప్రొక్లైనర్​ ఎక్కించి మరీ..!

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.