హైదరాబాద్ నారాయణగూడ పైవంతెన కింద ఉన్న పురాతనమైన లింగంపల్లి మార్కెట్ కూల్చివేతను జీహెచ్ఎంసీ అధికారులు ప్రారంభించారు.
మార్కెట్ శిథిలావస్థకు చేరడం వల్ల.. దానిని కూల్చివేసి... అదే స్థానంలో నూతన మార్కెట్‌ను బల్దియా అధికారులు నిర్మించనున్నారు. ఎన్నో ఏళ్లుగా మార్కెట్‌నే నమ్ముకుని జీవనం సాగిస్తున్నామని.. నూతన మార్కెట్ నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయ స్థలం చూపించాలంటూ... వ్యాపారులు ఆందోళనకు దిగారు. అప్రమత్తమైన పోలీసులు.. భారీ బందోబస్తును ఏర్పాటుచేసి.. నిర్మాణాల కూల్చివేతను కొనసాగిస్తున్నారు.