ETV Bharat / city

తగ్గిన మావోయిస్టులు... పొరుగు రాష్ట్రాల నుంచి ఎగుమతి

రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద ఉద్యమంలోకి వస్తున్న వారు తగ్గిపోగా... క్షేత్రస్థాయిలో కార్యకలాపాల నిర్వహణకు పొరుగు రాష్ట్రాలకు చెందిన వారిని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం వందమంది మావోయిస్ట్​లుండగా.. అందులో 85 మంది చత్తీస్​ఘడ్​కు చెందినవారిగా తెలుస్తోంది.

less number of Maoists in telangana so exported from chattisgarh
తగ్గిన మావోయిస్టులు... పొరుగు రాష్ట్రాల నుంచి ఎగుమతి
author img

By

Published : Jan 9, 2020, 5:36 AM IST

తెలంగాణలో వామపక్ష తీవ్రవాద ఉద్యమంలోకి స్థానికంగా నియామకాలు తగ్గిపోగా క్షేత్రస్థాయిలో కార్యకలాపాల నిర్వహణకు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు వందమంది మావోయిస్టులు క్షేత్రస్థాయి కార్యకలాపాల్లో నిమగ్నం కాగా అందులో 85 మంది ఛత్తీస్​ఘడ్​కు చెందిన వారే. ఈ మేరకు నిఘా విభాగం నివేదిక రూపొందించింది. ఇప్పుడు వారి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరంతా ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాలను కేంద్రంగా చేసుకొని కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

అక్కడి వారికి ప్రత్యేక శిక్షణ...

గతంతో పోల్చితే రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలు తగ్గిన సంగతి తెలిసిందే. నియామకాలు తగ్గిపోవడం..లొంగిపోవడం, ఎన్‌కౌంటర్లలో మరణించడం వంటివి చోటుచేసుకున్నాయి. ఇక్కడ మళ్లీ సత్తా చాటుకునేందుకు మావోయిస్టు అగ్రనాయకత్వం దృష్టి సారించింది. నిఘా వర్గాల సమాచారం మేరకు ప్రస్తుతం తెలంగాణకు చెందిన 145 మంది అజ్ఞాతంలో ఉండగా వీరంతా చత్తీస్​ఘడ్​లో ఉన్నట్లు తేలింది.

85 మందికి శిక్షణనిస్తున్న రాష్ట్ర మావోలు..

తెలంగాణలో ఉద్యమాన్ని పటిష్ఠం చేయాలని భావిస్తున్న అగ్రనాయకత్వానికి చురుగ్గా వ్యవహరించగలిగే స్థానిక క్యాడర్ దొరకట్లేదు. దీంతో అక్కడి వారికి శిక్షణ ఇచ్చి ఇక్కడకు పంపినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి చెందిన 15 మంది వీరికి మార్గదర్శనం చేస్తున్నట్లు గుర్తించారు. పోలీసుల దగ్గర మన రాష్ట్ర మావోల వివరాలున్నాయి. ఇతర రాష్ట్రాల వారివి లేనందున వీరి కదలికలను దృష్టిలో ఉంచుకుని సరిహద్దు జిల్లాల్లో పోలీసులను అప్రమత్తం చేశారు.

అన్నింటికీ మించి ఇటీవల ఈ జిల్లాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పని చేస్తున్న సిబ్బందిని ఇప్పటికే బదిలీ చేశారు. వామపక్ష తీవ్రవాదం వ్యతిరేక కార్యకలాపాలను అదుపు చేయడంలో ఆనుభవం ఉన్న అధికారులు, సిబ్బందికి ఆయా ప్రాంతాల్లో పోస్టింగులు ఇచ్చారు. గాలింపు చర్యలు నిరంతరం కొనసాగిస్తున్నారు.

తగ్గిన మావోయిస్టులు... పొరుగు రాష్ట్రాల నుంచి ఎగుమతి

ఇదీ చదవండిః చంద్రబాబును ఆయన నివాసానికి తరలించిన పోలీసులు

TG_HYD_03_09_MAOISTS_INFO_DRY_3182400 రిపోర్టర్ నాగార్జున ( )తెలంగాణలో వామపక్ష తీవ్రవాద ఉద్యమంలోకి స్థానికంగా నియామకాలు తగ్గిపోవడంతో క్షేత్రస్థాయిలో కార్యకలాపాల నిర్వహణకు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు వందమంది మావోయిస్టులు క్షేత్రస్థాయి కార్యకలాపాల్లో నిమగ్నం కాగా అందులో 85 మంది ఛత్తీస్ గడ్ కు చెందిన వారే. మిగతా 15 మంది తెలంగాణకు చెందిన వారని లెక్కగట్టారు. ఈ మేరకు నిఘా విభాగం నివేదిక రూపొందించింది. దీంతో ఇప్పుడు వారి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా వీరంతా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాలను కేంద్రంగా చేసుకొని కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఆయా జిల్లాల అధికారులను ఇదివరకే హెచ్చరించిన అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. అక్కడి వారికి ప్రత్యేక శిక్షణ... గతంతో పోల్చితే రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలు తగ్గిన సంగతి తెలిసిందే. నియామకాలు తగ్గిపోవడం..లొంగిపోవడం, ఎన్‌కౌంటర్లలో మరణించడం వంటివి చోటుచేసుకున్నాయి. ఇక్కడ మళ్లీ సత్తా చాటుకునేందుకు మావోయిస్టు అగ్రనాయకత్వం దృష్టి సారించింది. నిఘా వర్గాల సమాచారం మేరకు ప్రస్తుతం తెలంగాణకు చెందిన 145 మంది అజ్ఞాతంలో ఉండగా వీరంతా చత్తీస్గఢ్ లో ఉన్నట్లు తేలింది. తెలంగాణలో ఉద్యమాన్ని పటిష్టం చేయాలని భావిస్తున్న అగ్రనాయకత్వానికి చురుగ్గా వ్యవహరించగలిగే స్థానిక క్యాడర్ దొరకడం లేదు. దీంతో అక్కడి వారికి శిక్షణ ఇచ్చి ఇక్కడకు పంపినట్లు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన 15 మంది వీరికి మార్గదర్శనం చేస్తున్నట్లు గుర్తించారు. వామపక్ష తీవ్రవాద ఉద్యమంలో పని చేస్తున్న తెలంగాణకు చెందిన ప్రతి ఒక్కరి వివరాలన్నీ పోలీసుల వద్ద ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన వారి వివరాలు లేనందున...వీరి కదలికలను దృష్టిలో ఉంచుకుని సరిహద్దు జిల్లాల్లో పోలీసులను అప్రమత్తం చేశారు. అన్నింటికీ మించి ఇటీవల ఈ జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పని చేస్తున్న సిబ్బందిని ఇప్పటికే బదిలీ చేశారు. వామపక్ష తీవ్రవాదం వ్యతిరేక కార్యకలాపాలను అదుపు చేయడంలో ఆనుభం ఉన్న అధికారులు, సిబ్బందికి ఆయా ప్రాంతాల్లో పోస్టింగులు ఇచ్చారు. గాలింపు చర్యలు నిరంతరం కొనసాగిస్తున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.