ETV Bharat / city

'సారా మరణాలపై అసెంబ్లీ సాక్షిగా జగన్ అబద్ధాలు చెప్పారు' - TDP Reaction on Jangareddygudem deaths

TDP About Jangareddygudem deaths : జంగారెడ్డిగూడెం నాటుసారా మరణాలపై అసెంబ్లీ సాక్షిగా ఏపీ సీఎం జగన్‌ పచ్చి అబద్దాలు చెప్పారని తెలుగుదేశం మండిపడింది. 58 వేల జనాభా ఉన్నచోట 2 శాతం ప్రజలు చనిపోవడం సాధారణమేనంటూ బాధ్యతా రాహిత్యంగా మాట్లాడమేంటని శాసనసభా పక్షం నిలదీసింది. నాటుసారా తాగడం వల్లే తమవాళ్లు చనిపోయారని బాధిత కుటుంబాలే చెబుతుంటే.. సహజ మరణాలని అపహాస్యం చేస్తారా అని నేతలు ప్రశ్నించారు. అలాగే క్షేత్రస్థాయిలో బాధిత కుటుంబాలను జనసేన నేతలు పరామర్శించారు.

Jangareddygudem deaths in AP
Jangareddygudem deaths in AP
author img

By

Published : Mar 16, 2022, 7:05 AM IST

సారా మరణాలపై అసెంబ్లీ సాక్షిగా జగన్ అబద్ధాలు చెప్పారు

TDP About Jangareddygudem deaths : ఏపీలోని జంగారెడ్డిగూడెంలో 4 రోజుల్లో 18 వేల 300 లీటర్ల సారా ధ్వంసం చేశామని SI చెబుతుంటే.. ఆ ప్రాంతంలో నాటుసారా కాయడం లేదని ఆ రాష్ట్ర సీఎం జగన్‌ చెప్పడం ఏమిటని తెలుగుదేశం శాసనసభా పక్షం నిలదీసింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.... జంగారెడ్డిగూడెం నాటుసారా మరణాల అంశంపై చర్చించారు. సారా చావుల ఘటనపై విచారణ జరిపించాలని పట్టుబట్టినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని నేతలు ధ్వజమెత్తారు. దేవాలయం లాంటి నిండు శాసనసభలో.. సహజ మరణాలంటూ సీఎం అబద్దాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సారా మరణాలపై ప్రశ్నించిన తెలుగుదేశం ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడమేంటని ధ్వజమెత్తారు.

TDP Reaction on Jangareddygudem deaths : "శాసన సభలో అక్రమ మద్యం అక్కడ తయారవ్వలేదని నువ్వు చెప్పావో.. అక్కడే 33 కేసులు నమోదు చేశారు. అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు ఆడినా నువ్వు.. అక్కడ ఉండటం అవసరమా ? బాధితుల తరఫున న్యాయం జరిగే వరకు మేము పోరాడుతాం"

- అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు

Jangareddygudem deaths Updates : ఏపీ వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ప్రాతినిధ్యం వహిస్తున్న ఏలూరులో ఉన్న జిల్లా ఆస్పత్రిలోనే.. 4నెలల్లో 50మంది కల్తీ మద్యం బాధితులు మృతి చెందినట్లు ఆధారాలు ఉన్నాయని తెలుగుదేశం నేత చింతమనేని ప్రభాకర్ అన్నారు. జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాటుసారా బాధితుల్ని ఆయన పరామర్శించారు.

Jangareddygudem deaths in AP : కల్తీ సారా తాగి నిరుపేదలు పదుల సంఖ్యలో చనిపోతే.. సహజ మరణాలని అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్‌ చెప్పడం దారుణమని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. జంగారెడ్డిగూడెంలో మృతుల కుటుంబాలను నాదెండ్ల మనోహర్, నాగబాబు పరామర్శించారు. బాధిత కుటుంబసభ్యుల్ని భయభ్రాంతులకు గురిచేస్తూ, ప్రభుత్వం నిజాలను కప్పిపుచ్చుతోందని మండిపడ్డారు.

"కల్తీ సారా తాగి.. ప్రజలు చనిపోతే ప్రభుత్వం ఏం చేస్తోంది. సీఎం.. శాసన సభలో సహజ మరణాలు అంటారా.. మనిషి ప్రాణం అంటే లెక్కలేదా ?. అక్కడ ఒక్కో కుటుంబాన్ని చూస్తుంటే కన్నీళ్లు ఆగటం లేదు మాకు."

-నాగబాబు, జనసేన నేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.