హైదరాబాద్ కర్మన్ఘాట్ నిర్మలానగర్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్ ప్రారంభించారు. అసాంఘిక శక్తులను అరికట్టడానికి సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అనేక క్లిష్టమైన కేసులను సీసీ కెమెరాల సాయంతో పరిష్కరించినట్టు వెల్లడించారు.
కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల సమాజంలో జరిగే దొంగతనాలు, ఇతర నేరాలను అరికట్టడానికి ఆస్కారం ఉంటుందన్నారు. ఇప్పటికే అనేక మందికి శిక్ష విధించినట్టు తెలిపారు.
ఇదీ చూడండి: తహసీల్దార్ కార్యాలయాల్లో పని విభజన చేయాలి: కిషన్‌రెడ్డి