మెట్రోరైల్లో మద్యం మత్తులో అలజడి సృష్టించిన వ్యక్తిని మెట్రో సెక్యూరిటీ అధికారులు పట్టుకున్నారు. అతడిని ఉస్మానియా యూనివర్శిటీ పోలీసులకు అప్పగించారు. ఈ నెల 8వ తేదీన మెట్రో రైలులో సీలం కనకరాజు అనే వ్యక్తి మద్యం మత్తులో అధిక సౌండ్‌తో చరవాణీలో పాటలు పెట్టుకుని నృత్యాలు చేస్తూ సెల్ఫీలు దిగుతూ హల్చల్ చేశాడు. సీసీటీవీ ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీతో అతన్ని కనకరాజుగా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: దక్షిణ మధ్య రైల్వేకు 4 జాతీయ అవార్డులు