ETV Bharat / city

KTR : మంత్రి కేటీఆర్ ట్విటర్​కు భూసమస్యల వినతులు

రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్​కు వినతులు వెల్లువెత్తుతున్నాయి. కేటీఆర్​కు ట్వీట్ చేస్తే తమ సమస్య తప్పకుండా.. క్షణాల్లో పరిష్కారమవుతుందని ప్రజల్లో అభిప్రాయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇటీవల మంత్రి ట్విటర్​కు భూ సంబంధిత సమస్యల విజ్ఞప్తులు ఎక్కువగా వస్తున్నాయి. వాటిపై స్పందించిన కేటీఆర్.. సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులను ఆదేశిస్తున్నారు.

minister ktr, telangana it minister ktr, ktr twitter
మంత్రి కేటీఆర్, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, కేటీఆర్ ట్విటర్
author img

By

Published : Jun 1, 2021, 9:19 AM IST

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ ఖాతా భూసంబంధిత ఫిర్యాదులకు మాధ్యమంగా మారింది. తమ భూముల సమస్యలు పరిష్కారం కావడం లేదని పలువురు మంత్రికి ట్వీట్ చేశారు. వాటిని పరిష్కరించాల్సిందిగా కేటీఆర్.. ఆయా జిల్లాల కలెక్టర్లను కోరారు. భూరికార్డుల ప్రక్షాళన, ధరణి పోర్టల్ ప్రారంభం నుంచి పలు చోట్ల వివిధ కారణాల వల్ల భూసంబంధిత సమస్యలు పెండింగ్​లో ఉన్నాయి. కొన్ని చోట్ల పార్ట్ బీలో ఉండడం, మరికొన్ని చోట్ల మ్యుటేషన్ పూర్తి కాకపోవడం, ఇంకా ఇతర సమస్యలు కూడా ఉన్నాయి.

పార్ట్ బీలో ఉన్నా, తమ పేరిట మ్యుటేషన్ కాకపోయినా రైతుబంధు సాయం అందడం లేదని పలువురు రైతులు వాపోతున్నారు. తాజాగా వానాకాలం రైతుబంధు సాయాన్ని ఈ నెల 15 నుంచి జమచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పార్ట్ బీలోని భూములు పార్ట్ ఏలోకి చేరే కటాఫ్ తేదీని జూన్ పదిగా నిర్ణయించారు. ఆలోగా తమ సమస్యను పరిష్కరించుకుంటే రైతుబంధు వస్తుందన్న ఉద్దేశంతో పలువురు ప్రయత్నిస్తున్నారు.

మంత్రి కేటీఆర్​కు ట్వీట్ చేసి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. నిర్మల్, మహబూబాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, వనపర్తి జిల్లాలకు చెందిన కొందరు కేటీఆర్​కు ట్వీట్ చేసిన వారిలో ఉన్నారు.

ఇదీ చూడండి: వీడియో వైరల్: సింగిల్ విండో ఛైర్మన్ లంచం డిమాండ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.