పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు లక్ష తులసి పూజ నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య అత్యంత సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమం నిర్వహించారు.
కొవిడ్ నేపథ్యంలో భక్తులెవర్నీ అనుమతించలేదు. వేద పండితులు, ఆలయ అర్చకులే కార్యక్రమాలు పూర్తి చేశారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో స్వామివారి కల్యాణం నిర్వహించడం ఆనవాయితీ. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా అలంకరించారు.
ఇవీచూడండి: యాదాద్రి వెండిశిల్పఫలకాలపై ప్రహ్లాదచరితం