రకరకాల ఆసనాలతో ఆకట్టుకుంటున్న ఈ యువతి పేరు ప్రసన్న. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు చెందిన ప్రసన్న.. ఆరో తరగతిలోనే యోగాపై ఆసక్తి పెంచుకుంది. ఓ గురువు వద్ద ఓనమాలు నేర్చుకుని క్రమం తప్పకుండా సాధనతో యోగాపై పట్టుసాధించింది. ఏడాదిలోనే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని విశేషమైన ప్రతిభ కనబరిచి ఎన్నో పతకాలు సొంతం చేసుకుంది. యోగాలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉండాలనే తలంపుతో ఆంగ్ల అక్షరాలు, అంకెలను యోగాసనాల ద్వారా వేస్తోంది. యోగా ప్రాధాన్యతను తెలియజేయాలన్న ఉద్దేశంతో... భరతనాట్యానికి మిళితం చేసి.. 101 ఆసనాలు వేస్తోంది. కేవలం 13 నిముషాల వ్యవధిలోనే 100 కుపైగా ఆసనాలు వేస్తూ ప్రశంసలు అందుకుంటోంది.
కర్నూలు నగరంలో జరిగే యోగా డే కార్యక్రమంలో ప్రసన్న యోగాసనాలు లేకుండా కార్యక్రమం జరగదంటే అతిశయోక్తి కాదు. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. ఈటీవీ ప్లస్ ఛానల్ నిర్వహించిన స్టూడెంట్ నంబర్ 1 అనే కార్యక్రమంలో... అద్భుత ప్రతిభను కనబరిచి మొదటి స్థానంలో నిలిచింది. చిన్నారులకు యోగా పాఠాలు నేర్పుతోంది. యోగా సాధన ద్వారా అద్భుత ఫలితాలు సాధించవచ్చని... కరోనా లాంటి జబ్బులకు దూరంగా ఉండొచ్చని ప్రసన్న చెబుతోంది. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధిస్తానంటున్న ప్రస్నన్న.. యోగలో ఉన్నత శిఖరాలు అందించాలన్నదే తన లక్ష్యమంటోంది.
ఇదీ చదవండి: కారుణ్య ఉద్యోగాలు.. వెయ్యి కుటుంబాల ఆవేదన