ETV Bharat / city

'ఉదాసీనంగా ఉంటే మనకూ ఆ పరిస్థితే వస్తుంది' - కరోనా వైరస్​పై మంత్రి కేటీఆర్ ట్వీట్

స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటించి కరోనా మహమ్మారిని పారదోలవచ్చని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్​ అన్నారు. అమెరికా, ఇటలీ దేశాలు వైరస్​ వ్యాప్తి పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ktr tweet on self quarantine due to corona effect
'ఉదాసీనంగా ఉంటే మనకూ ఆ పరిస్థితే వస్తుంది'
author img

By

Published : Mar 21, 2020, 4:12 PM IST

కరోనా వైరస్​ వ్యాప్తి పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే అమెరికా, ఇటలీ వంటి దేశాలు ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్​ అన్నారు. చైనాకు పక్కనే ఉన్న జపాన్, సింగపూర్​, హాంగ్​కాంగ్​ వైరస్​ విస్తరణను సమర్థంగా కట్టడి చేస్తున్నాయని కొనియాడారు.

సరైన సమయంలో స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంత నష్టం జరుగుతుందో ఇటలీ వంటి దేశాలను చూస్తే తెలుస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. స్వీయ నియంత్రణతోనే వైరస్​ సోకకుండా అడ్డుకోగలమని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.