జీహెచ్‌ఎంసీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 3 పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. జీహెచ్‌ఎంసీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పనపై చర్చ జరిగింది. సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాల నేతలతో పాటు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ,సబితా ఇంద్రారెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
గ్రేటర్‌లో అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. అభివృద్ధి పనులపై మరోసారి అధికారులతో త్వరలోనే సమావేశం నిర్వహిస్తామన్నారు.
త్వరలోనే జీహెచ్‌ఎంసీ పరిధిలో పేదలకు ఇళ్లను అందిస్తాం. సుమారు 85 వేల ఇళ్లను పేద ప్రజలకు అందించేలా చర్యలు తీసుకున్నాం. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కూడా వేగవంతం చేయాలి. నియోజకవర్గాల్లో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న వాటిపై దృష్టి పెట్టాలి - కేటీఆర్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి
ఇవీ చూడండి: రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం అమలవుతుందా..? కాదా..?