ktr reply on khajaguda rocks: హైదరాబాద్‌లోని పుప్పాలగూడ గ్రామంలోని ఖాజాగూడలో విలువైన రాతి సంపదతో పాటు, చెట్లు ధ్వంసం చేస్తున్న వారిపై కేసు నమోదైంది. ఈ మేరకు రాతి సంపదతో పాటు చెట్లను సంరక్షించాలని కోరుతూ సొసైటీ టు సేవ్ రాక్స్... పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను కోరుతూ ట్వీట్ చేసింది.
సొసైటీ సభ్యులు చేసిన ట్వీట్ చూసి కేటీఆర్ స్పందించారు. ఈ విషయంపై విచారణ జరపాలని కేటీఆర్... పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ను ఆదేశించారు. దీంతో పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి విచారణ జరిపి సర్వే నెంబర్ 452/1, 454/1 లో రాతి సంపద, చెట్లు ధ్వంసం అవుతున్నాయని గుర్తించారు.
ఇందుకు కారణమైన నలుగురిపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో వీఆర్‌ఏను సస్పెండ్ చేశారు. ఆయా సర్వే నెంబర్లలో కాపాలదారులను నియమించారు.
ఇదీ చదవండి:KTR Tweet Today : 'వారి కల సాకారం చేయడం ఆనందంగా ఉంది'