ETV Bharat / city

KTR Letter To Nirmala Seetharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌కు కేటీఆర్ లేఖ.. - పురపాలకశాఖ మంత్రి కేటీఆర్

KTR Letter To Nirmala Seetharaman
KTR Letter To Nirmala Seetharaman to release funds for development works
author img

By

Published : Jan 20, 2022, 9:14 PM IST

Updated : Jan 20, 2022, 10:48 PM IST

21:08 January 20

KTR Letter To Nirmala Seetharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌కు కేటీఆర్ లేఖ..

KTR Letter To Nirmala Seetharaman: రాష్ట్రంలో పురపాలకశాఖ తరఫున చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్​కు లేఖ రాశారు. కేపీహెచ్​బీ నుంచి కోకాపేట మీదుగా నార్సింగి వరకు 30 కిలోమీటర్ల మేర ఎమ్మార్టీస్ మెట్రో నియో నెట్​వర్క్ ప్రాజెక్టును ప్రతిపాదిస్తున్నట్లు తెలిపిన మంత్రి... ప్రతిపాదిత ఎయిర్ పోర్ట్ ఎక్స్​ప్రెస్​ను ప్రస్తుత మెట్రో రైల్​ నెట్​వర్క్​ను అనుసంధానిస్తుందని తెలిపారు. 2030 నాటికి రోజుకు ఐదు లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా వేస్తున్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యయమైన 3050 కోట్లలో 15 శాతం వాటా కింద 450 కోట్లు మంజూరు చేయాలని కేటీఆర్ కోరారు. వరంగల్​లో మెట్రో నియో ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని... ప్రాజెక్టు వ్యయంలో 20 శాతంగా 184 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్​కు అనుగుణంగా రాష్ట్రంలో మెట్రో నియో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్, పరిసరాల్లో మొత్తం 104 మిస్సింగ్ లింక్ రోడ్ల కారిడార్లకు 2400 కోట్ల వ్యయం అవుతుందని... అందులో మూడో వంతు 800 కోట్లు ఇవ్వాలని కోరారు. ఎస్సార్డీపీకి, 9000 కోట్ల వ్యయంతో నిర్మించే ప్యారడైస్ కూడలి నుంచి షామీర్​పేట ఓఆర్ఆర్ కూడలి, కండ్లకోయ వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్లకు నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు. 11,500 కోట్ల వ్యయంతో స్కైవేలతో కలిపి మూసీ వెంట ఇరువైపులా తూర్పు-పశ్చిమ కారిడార్ల అనుసంధానానికి నిధులు ఇవ్వాలని, ఎస్సార్డీపీ రెండో దశకు 14వేల కోట్ల వ్యయం అవుతుందని, నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ కోరారు.

ఎస్సార్డీపీ, ఎలివేటెడ్ కారిడార్లు, మూసీ అనుసంధానం ప్రాజెక్టుల వ్యయాల్లో మూడో వంతు 3450 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలో నిర్మిస్తున్న ఎస్టీపీలకు నిధులు ఇవ్వాలని కోరిన మంత్రి... వివిధ దశల్లో 8684 కోట్లతో చేసే పనులకు మూడు వంతు నిధులు మంజూరు చేయాలని కోరారు. రానున్న కేంద్ర బడ్జెట్​లో ఈ మేరకు ఆయా ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ను కోరారు.

ఇదీ చూడండి:

Last Updated : Jan 20, 2022, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.