ETV Bharat / city

KTR Speech: ఈటల, రేవంత్‌ భేటీ వెనుక మతలబేంటి?: కేటీఆర్‌ - minister KTR visited TRS Plenary Meeting set

రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పడిన తెరాస.. జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిందని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. పార్టీ ఆవిర్భవించి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా తెరాస ద్విదశాబ్ది వేడుకలను మాదాపూర్ హైటెక్స్​లో నిర్వహిస్తున్నారు. ఈ వేడుక ఏర్పాట్లను పరిశీలించిన కేటీఆర్.. సమావేశానికి 6వేలకు పైగా ప్రతినిధులు హాజరవనున్నారని చెప్పారు.

TRS Plenary Meeting
TRS Plenary Meeting
author img

By

Published : Oct 23, 2021, 10:54 AM IST

Updated : Oct 23, 2021, 12:34 PM IST

"రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న తెరాస ఆవిర్భవించింది. జాతీయ రాజకీయ వ్యవస్థను శాసించే స్థాయికి ఎదిగాం. ఉద్యమ సమయంలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నాం. పరిపాలనను కొత్త మలుపులు తిప్పి తెలంగాణను దేశానికి దిక్సూచిగా కేసీఆర్ నిలిపారు. పక్క రాష్ట్రాల ఎమ్మెల్యేలు సైతం మా జిల్లాను తెలంగాణలో కలుపమని కోరుతున్నాయి. పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలు, పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికలో భాగంగానే ఫ్లీనరీ(TRS Plenary Meeting) నిర్వహిస్తున్నాం. ఫ్లీనరీ(TRS Plenary Meeting) లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. ఫ్లీనరీ ఏర్పాట్లు సాయంత్రానికల్లా పూర్తి అవుతాయి. ఫ్లీనరీ లో ఏడు అంశాల మీద తీర్మానాలు ఉంటాయి."

- కేటీఆర్, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్

జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగాం

తెలంగాణ రాష్ట్ర సమితి సంస్థాగత ఎన్నికల్లో భాగంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుణ్ని ఈనెల25న ఎన్నుకోనున్నారు. హైదరాబాద్​ హెచ్​ఐసీసీలో జరిగే పార్టీ ప్లీనరీ సమావేశం(TRS Plenary Meeting)లో ఈ ఎన్నిక జరగనుంది. తెరాస పార్టీ ప్లీనరీ సమావేశాల(TRS Plenary Meeting) నిర్వహణకు సంబంధించి మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్(Telangana minister KTR) హైటెక్స్ ప్రాంగణాన్ని పరిశీలించారు.

తెరాస ద్విదశాబ్ది వేడుకల్లో భాగంగా నిర్వహిస్తోన్న ప్లీనరీ సమావేశానికి(TRS Plenary Meeting) వచ్చే ప్రతినిధుల కోసం చేస్తున్న ఏర్పాట్లపై మంత్రి ఆరా తీశారు. సభా వేదిక, పార్కింగ్ ప్రదేశాలు పరిశీలించారు. హైటెక్స్‌ వెళ్లే మార్గంలో సమావేశం రోజున ట్రాఫిక్‌ నియంత్రణకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై పోలీసు అధికారులతో మాట్లాడారు. మంత్రి కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు గాంధీ, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు ఉన్నారు.

తెరాస పార్టీ ప్లీనరీ సమావేశానికి 6వేలకు పైగా ప్రతినిధులు హాజరుకానున్నారని కేటీఆర్ తెలిపారు. ఈ నెల 25న ఉదయం 10గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రతినిధుల నమోదు కోసం 35 కౌటర్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. సభా ప్రాంగణానికి ఇరువైపులా 50ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామని వివరించారు. గులాబీ చొక్కాలు, చీరలు ధరించి రావాలని ప్రతినిధులకు పిలుపునిచ్చినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో భోజన ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు.

హుజూరాబాద్​లో కాంగ్రెస్, భాజపా ఒక్కటై తెరాసను నిలువరించే ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి కేటీఆర్(Telangana minister KTR) ఆరోపించారు. ఈ ఉపఎన్నికలో భాజపా, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి పోటీ చేస్తున్నారని విమర్శించారు. గోల్కొండ హోటల్​లో ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి రహస్యంగా కలిశారని సమాచారం ఉందని చెప్పారు. ఇద్దరు కలిసింది నిజామా కాదా స్పష్టం చేయాలని డిమాండ్ చేసిన కేటీఆర్ ఆధారాలు కూడా బయటపెడతామని అన్నారు.

సొంత పార్టీ బాగోగులు పట్టించుకోకుండా ఇతర పార్టీల గురించి ఎందుకు ఆలోచిస్తున్నారని మానిక్కం ఠాగూర్​ను కేటీఆర్(Telangana minister KTR) ప్రశ్నించారు. గాంధీ భవన్​లో గాడ్సేలు దూరారని విమర్శించారు. దళిత బంధును ఆపడం ఏమాత్రం సబబో ఆలోచించాలని ఈసీని కోరారు. ఎన్నికల కమిషన్ పరిధి దాటి వ్యవహరిస్తోందని మంత్రి కేటీఆర్(Telangana minister KTR) మండిపడ్డారు.

Last Updated : Oct 23, 2021, 12:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.