ETV Bharat / city

KRMB: ఎన్‌జీటీకి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మధ్యంతర నివేదిక - AP TS WATER WAR

krmb letter to ngt
krmb letter to ngt
author img

By

Published : Aug 8, 2021, 4:35 PM IST

Updated : Aug 8, 2021, 5:14 PM IST

16:32 August 08

ఎన్‌జీటీకి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మధ్యంతర నివేదిక

రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించి నివేదిక ఇచ్చేందుకు మూడు వారాల సమయం కావాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు జాతీయ హరిత ట్రైబ్యునల్​ను కోరింది. సుప్రీం కోర్డు, జాతీయ హరిత ట్రైబ్యునల్​లో.. రేపు విచారణ ఉన్న నేపథ్యంలో ఎన్జీటీకి బోర్డు మధ్యంతర నివేదిక సమర్పించింది.  

రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలన కోసం నియమించిన కేంద్ర జలసంఘం సంచాలకులు పి. దేవేందర్ రావు స్థానంలో మరొకరిని నామినేట్ చేయాలని కేంద్ర జలశక్తి శాఖను కోరినట్లు బోర్డు తెలిపింది. తెలంగాణకు చెందిన దేవేందర్​రావు.. పరిశీలన బృందంలో ఉండడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో అభ్యంతరం చెప్పింది. తెలుగు రాష్ట్రాల వారెవరూ లేకుండా రాయలసీమ పనులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ.. కృష్ణా బోర్డును ఆదేశించింది. దీంతో దేవేందర్​రావు స్థానంలో ప్రాజెక్టుల డీపీఆర్, డిజైన్, ఇన్వెస్టిగేషన్​లపై అవగాహన ఉన్న చీఫ్ ఇంజనీర్ లేదా సంచాలకుల స్థాయి అధికారిని నామినేట్ చేయాలని కోరినట్లు కేఆర్ఎంబీ తెలిపింది. నామినేట్ చేసిన వెంటనే ఓ బృందాన్ని ఏర్పాటు చేస్తామని... ఆ బృందం రాయలసీమ ఎత్తిపోతల పరిశీలనకు వెళ్తుందని కేఆర్ఎంబీ తెలిపింది. ఆ తరువాత నివేదిక సమర్పిస్తామని ఎన్జీటీకి వివరించింది. 

సంబంధిత వార్తలు: 

Last Updated : Aug 8, 2021, 5:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.