ETV Bharat / city

KRISHNA BOARD: కొద్ది రోజుల్లో కృష్ణాబోర్డు సమావేశం.. ఇరు రాష్ట్రాల నీటి కేటాయింపులపై చర్చ - కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తాజా వార్తలు

త్వరలో కృష్ణాబోర్డు సమావేశం కానున్నట్లు తెలిసింది. తెలుగు రాష్ట్రాలకు ప్రాజెక్టుల నుంచి నీటి కేటాయింపులపై చర్చించేందుకు నిర్వహిస్తారని తెలుస్తోంది. బోర్డు పరిధిని నిర్ధారిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్‌ అమలుపైనా చర్చించేందుకు కృష్ణాబోర్డు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.

Krishna River management Board
కృష్ణా బోర్డు
author img

By

Published : Jul 30, 2021, 7:31 AM IST

తెలుగు రాష్ట్రాలకు ప్రాజెక్టుల నుంచి నీటి కేటాయింపులపై చర్చించేందుకు కొద్ది రోజుల్లో కృష్ణాబోర్డు సమావేశం కానున్నట్లు తెలిసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల కింద ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో సాగు, తాగు అవసరాలకు నీటి కేటాయింపులపై చర్చించనుంది. చెన్నై తాగునీటి అవసరాలు, ఏపీలోని వివిధ ప్రాజెక్టులకు 27 టీఎంసీలు అవసరమని ఏపీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఇప్పటికే బోర్డుకు లేఖ రాశారు. తెలంగాణ కూడా శ్రీశైలం, జూరాల, సాగర్‌లతోపాటు కల్వకుర్తి, దేవాదుల తదితర ఎత్తిపోతల కింద నీటి కేటాయింపుల కోసం బోర్డుకు విన్నవించేందుకు కసరత్తు పూర్తి చేసినట్లు తెలిసింది.

బోర్డు పరిధిని నిర్ధారిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్‌ అమలుపైనా చర్చించేందుకు కృష్ణాబోర్డు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. గెజిట్‌ను నోటిఫై చేసేందుకు కేంద్రం ఇచ్చిన 30 రోజుల గడువులో ఇప్పటికే 15 రోజులు పూర్తయ్యాయి. దీంతో వచ్చే బోర్డు సమావేశంలో రెండు రాష్ట్రాల ప్రతినిధులతో చర్చించేందుకు విధానాలను రూపొందిస్తున్నారు. ప్రాజెక్టుల నిర్వహణ, సిబ్బంది కేటాయింపులు ఏ విధంగా పూర్తి చేయాలనేదానిపై చర్చించనున్నట్లు సమాచారం. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రాన్ని గురువారం తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు సందర్శించారు. విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్న ఐదు యూనిట్లను పరిశీలించారు. దెబ్బతిన్న యూనిట్లకు అతి తక్కువ ఖర్చుతో మరమ్మతులు పూర్తి చేసిన జెన్‌కో సిబ్బందిని అభినందించారు. నాలుగో యూనిట్‌ మరమ్మతులను త్వరగా పూర్తి చేసి ఉత్పత్తికి సిద్ధం చేయాలని సూచించారు.

కృష్ణాబోర్డుకు తెలంగాణ లేఖ

త్రిసభ్య కమిటీ అనుమతి లేకుండా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలు విడుదల చేయకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు గురువారం తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. కుడిగట్టు కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలన్న ఏపీ విజ్ఞప్తిపై బోర్డు తెలంగాణను అభిప్రాయం కోరింది. దానికి స్పందించి లేఖ రాసిన తెలంగాణ ఈఎన్సీ.. శ్రీశైలం కుడిగట్టు కేంద్రం ద్వారా ఏపీ విద్యుత్ ఉత్పత్తికి అభ్యంతరం లేదని తెలిపారు.

ఇదే సమయంలో శ్రీశైలం ఎడమగట్టు, నాగార్జునసాగర్‌, పులిచింతల కేంద్రాల ద్వారా గరిష్ఠ విద్యుత్ ఉత్పత్తికి అనుమతించాలని కోరారు. రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలు, బోర్ల కోసం విద్యుత్ ఉత్పత్తి అవసరమని వివరించారు. కృష్ణా బేసిన్ అవసరాలు తీరకుండా బేసిన్ వెలుపలకు జలాలను తరలించకుండా ఏపీని నిలువరించాలని ఇప్పటికే బోర్డు దృష్టికి, కేంద్ర జలశక్తిశాఖను పదేపదే కోరామని... అత్యున్నత మండలి రెండో సమావేశంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని ఈఎన్సీ లేఖలో పేర్కొన్నారు. బేసిన్ అవసరాలు తీరకుండా కృష్ణాజలాలను ఇతర బేసిన్లకు ఆంధ్రప్రదేశ్ తరలించకుండా చూడాలని మరోమారు విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది నుంచి కృష్ణా జలాలను చెరిసగం వినియోగించుకోవాలని తెలంగాణ మరోమారు లేఖలో కోరింది.

ఇదీ చదవండి: NagarjunaSagar : రెండు రోజుల్లో సాగర్‌ను తాకనున్న శ్రీశైలం జలాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.