ETV Bharat / city

కేసీఆర్​ బర్త్​డే: ఉద్యమంలా కోటి వృక్షార్చన కార్యక్రమం - ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా కోటివృక్షార్చన కార్యక్రమం ఉద్యమంలా నిర్వహించారు. తెరాస శ్రేణులు, ప్రజాప్రతినిధులు తమ అభిమాన నేతకు శుభాకాంక్షలు చెబుతూ... ఎక్కడికక్కడ మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్​ స్వయంగా కోటి వృక్షార్చనలో పాల్గొని ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో.. రుద్రాక్ష మొక్కను నాటారు.

కేసీఆర్​ బర్త్​డే: ఉద్యమంలా కోటి వృక్షార్చన కార్యక్రమం

author img

By

Published : Feb 17, 2021, 8:22 PM IST

కేసీఆర్​ బర్త్​డే: ఉద్యమంలా కోటి వృక్షార్చన కార్యక్రమం

సీఎం కేసీఆర్‌ 67వ జన్మదిన వేడుకల్లో భాగంగా.. ఎంపీ సంతోశ్‌ కుమార్​ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా కోటివృక్షార్చన కార్యక్రమం ఉద్యమంలా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ స్వయంగా కోటి వృక్షార్చనలో పాల్గొన్నారు. ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆయన రుద్రాక్ష మొక్కను నాటారు. అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారని సంతోశ్‌ కుమార్‌ను కేసీఆర్‌ అభినందించారు. ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ మొక్కలు నాటారు. ఆయన సతీమణి, కూతురితో కలిసి కోటివృక్షార్చనలో పాల్గొన్నారు.

మూసీ తీరంలో 'కోటి వృక్షార్చన'

రాష్ట్రవ్యాప్తంగా నేతలు, పార్టీ శ్రేణులు విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌ నాగోల్‌ మూసీ తీరంలో 'కోటి వృక్షార్చన' కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ చేపట్టారు. సిద్దిపేటలో నర్సాపూర్ చౌరస్తా నుంచి కరీంనగర్ రాజీవ్‌ రహదారి వెళ్లే మార్గంలో రోడ్డుకిరువైపులా మంత్రి హరీశ్‌రావు, తెరాస కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటారు. సంగారెడ్డి కారాగారంలో హోంమంత్రి మహమూద్‌ అలీ మొక్కలు నాటారు. ఖమ్మం సీబీఐటీ కళాశాలలో 'కోటి వృక్షార్చన' కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీ నామ నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు. త్వరలో మరో కార్యక్రమానికి శ్రీకారం చుడతామని రాజ్యసభ సభ్యుడు సంతోశ్‌ కుమార్‌ ప్రకటించారు.

ఐదేళ్ల కాలంలో

హైదరాబాద్‌ కొండాపూర్ బొటానికల్ గార్డెన్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మొక్కలు నాటారు. ఈ ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో 210 కోట్ల మొక్కలు నాటినట్లు ఆయన తెలిపారు. బాన్సువాడలో నిర్వహించిన కోటి వృక్షార్చనలో సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొని.... మాతా శిశు సంరక్షణ కేంద్రంలో మొక్కలు నాటారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం జామ తండాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పల్లె నిద్ర అనంతరం ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌తో కలిసి మొక్కలు నాటారు. మామ్నూర్ 4వ పోలీసు బెటాలియన్‌లోనూ 'కోటి వృక్షార్చన' కార్యక్రమంలో ఎర్రబెల్లి పాల్గొన్నారు.

మొక్కలే కానుక

సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మొక్కలు నాటారు. హయత్‌నగర్ గిరిజన బాలికల గురుకులంలో మంత్రి సత్యవతి రాఠోడ్‌ మొక్కలు నాటారు. అనంతరం, అక్కడి బాలికలకు దుస్తులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి జన్మదినం వేళ మొక్కలు నాటడం కంటే మంచి బహుమతి లేదని...కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌లో మంత్రి ప్రశాంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు.

రాష్ట్రవ్యాప్తంగా..

మంత్రులే ప్రజాప్రతినిధులే గాక రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది కోటివృక్షార్చనలో పాల్గొన్నారు. ఎక్కడికక్కడ విస్తృతంగా మొక్కలు నాటారు.

ఇదీ చదవండి: సీఎం​ జన్మదిన వేడుకల్లో హరీశ్​ బ్యాటింగ్​.. ఎమ్మెల్యే బౌలింగ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.