Koil alwar tirumanjanam: తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంను తితిదే వైభవంగా నిర్వహిస్తోంది. తెలుగు సంవత్సరాది.. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని శుద్ధి చేశారు. వేకువజామున స్వామివారి సుప్రభాత, అర్చన సేవల అనంతరం శ్రీవారి మూలవిరాట్టును పట్టు వస్త్రంతో అర్చకులు పూర్తిగా కప్పివేశారు. సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలంతో ధ్వజస్తంభం వద్దకు ప్రదక్షిణగా వెళ్లి.. ఆలయ శుద్ధికార్యక్రమాన్ని మొదలుపెట్టారు.
ఆనందనిలయం, బంగారువాకిలితో పాటు ఆలయంలోని ఉపదేవాలయాలు, పూజాసామాగ్రి తదితర అన్ని చోట్ల శుభ్రపరిచారు. స్వామివారికి ప్రత్యేక పూజలు.. నైవేద్యం సమర్పించిన అనంతరం మధ్యాహ్నం నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు.
ఇదీ చదవండి: యాదాద్రి ఉద్ఘాటనా పర్వం పరిసమాప్తం.. పులకించిన భక్తజనం