టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో అప్పుడప్పుడు హంగామా చేస్తుండటం అందరికీ తెలుసు. పలు సందర్భాల్లో తన ఎమోషన్స్ ప్రదర్శించి అభిమానులకు ఉత్సాహం నింపుతుంటాడు. తాజాగా టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా బుధవారం అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ చేసిన డ్యాన్స్ అందరినీ అబ్బురపరిచింది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడిన టీమిండియా బ్యాటింగ్ చేసింది. కేఎల్ రాహుల్ 69 పరుగులు, రోహిత్ శర్మ 74 పరుగులు చేశారు. ఆ తర్వాత వచ్చిన మరో ఇద్దరూ రెచ్చిపోయారు. ఫలితంగా అఫ్గాన్‌కు 211 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది భారత్.
అనంతరం భారత జట్టు ఫీల్డింగ్ సమయంలో విరాట్ బౌండరీ లైన్ వద్దకు వస్తుండగా పాపులర్ హిందీ పాట.. మై నేమ్ ఈజ్ లఖన్ ప్లే అయింది. ఆ పాట వినగానే ఉత్సాహంగా స్పెప్పులేశాడు కోహ్లీ. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఈ మ్యాచ్‌లో భారీ లక్ష్య ఛేదనలో అఫ్గాన్ చేతులెత్తేసింది. ఓవర్లన్నీ ఆడినా.. ఆఫ్గాన్ కేవలం 144 రన్స్ మాత్రమే చేసింది. ఫలితంగా టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకు తొలి గెలుపు సొంతమైంది.
-
Dance of Virat in " My name is Lakhan " song 😍❤
— 𝙼𝙴𝚂𝚂𝙸𝙰𝙽 𝚃𝙰𝚁𝚄𝙻𝙰𝚃𝙰 𝚅𝙸𝚁𝙰𝚃𝙸𝙰𝙽 (@Tarulata_10_18) November 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Love to see our cheeku in happy mood 🥰 pic.twitter.com/vgBIq927h2
">Dance of Virat in " My name is Lakhan " song 😍❤
— 𝙼𝙴𝚂𝚂𝙸𝙰𝙽 𝚃𝙰𝚁𝚄𝙻𝙰𝚃𝙰 𝚅𝙸𝚁𝙰𝚃𝙸𝙰𝙽 (@Tarulata_10_18) November 4, 2021
Love to see our cheeku in happy mood 🥰 pic.twitter.com/vgBIq927h2Dance of Virat in " My name is Lakhan " song 😍❤
— 𝙼𝙴𝚂𝚂𝙸𝙰𝙽 𝚃𝙰𝚁𝚄𝙻𝙰𝚃𝙰 𝚅𝙸𝚁𝙰𝚃𝙸𝙰𝙽 (@Tarulata_10_18) November 4, 2021
Love to see our cheeku in happy mood 🥰 pic.twitter.com/vgBIq927h2
ఇదీ చదవండి : ఘనంగా దీపావళి వేడుకలు.. గల్లీగల్లీలో టపాసుల మోతలు..