Kodandaram Fires on KCR National Party: సీఎం కేసీఆర్ తక్షణ రాజకీయ అవసరాల కోసం మాత్రమే ఆలోచిస్తారని, జాతీయ పార్టీ నిర్ణయం వెనుక తక్షణ రాజకీయ అవసరం ఉందని తెజస అధ్యక్షుడు ప్రొ.కోదండరాం విమర్శించారు. కేసీఆర్ కొత్తగా జాతీయ పార్టీ పెట్టడంపై అనుమానం వ్యక్తం చేశారు. భారాస పార్టీ ఏర్పాటుపై నాంపల్లిలోని తెలంగాణ జన సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కోదండరాం విమర్శలు గుప్పించారు. రాష్ట్రం ఏర్పాటుతో అధికారంలోకి వచ్చిన పార్టీ అప్పటి నుంచి ఇప్పటివరకూ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ మేరకు నేరవేర్చిందని ఆయన ప్రశ్నించారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే పార్టీ పేరుతో నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.
కేసీఆర్‌కు ఆర్థిక సిద్ధాంతమే లేదు.. అలాంటిది ఎటువంటి ఆర్థిక నమూనా చేశారని ధ్వజమెత్తారు. నెహ్రూ, అంబేడ్కర్‌కు సిద్ధాంతం ఉంటూ ఉంది కాబట్టి ఆర్థిక నమూనా తయారు చేశారన్నారు. వైఫల్యాలు కప్పి పుచ్చుకోవడానికే జాతీయ పార్టీ పేరు తప్ప దీర్ఘకాలిక రాజకీయ అవసరాలపై ఆలోచించరన్నారు.
కుటుంబ అవసరాల కోసం మాత్రమే అధికారాన్ని వాడుకున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ అస్తిత్వాన్ని కేసీఆర్ రాజకీయ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారని.. దిల్లీ స్థాయిలో తెలంగాణ మోడల్ డొల్లతనాన్ని బయట పెడతామన్నారు. త్వరలో మునుగోడు ఎన్నికకు పార్టీ తరఫున అభ్యర్థిని ప్రకటిస్తామని, తెలంగాణ అభ్యున్నతి కోసం ప్రత్యేకమైన ఎజెండాతో ముందుకు వస్తామని కోదండరాం తెలిపారు.
ఇవీ చదవండి: